Ramani Ammal : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సింగర్ మృతి..

మొదట్లో జానపద పాటలతో గుర్తింపు రాగా, భరత్ ప్రేమిస్తే సినిమాలో ఓ పాటతో మరింత గుర్తింపు వచ్చింది. 2017లో తమిళ్ జీ సరిగమపలో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లి బాగా ఫేమస్ అయింది. పలు విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చి రాక్ స్టార్ రమణిగా తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Ramani Ammal Famous Tamil Folk Singer Passes away

Ramani Ammal : ఇటీవల సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు మరణిస్తూ వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ్ లో ఫోక్ సాంగ్స్(Folk Songs) తో గుర్తింపు తెచ్చుకున్న రమణి అమ్మాళ్(Ramani Ammal) మంగళవారం రాత్రి కన్నుమూశారు. 69 ఏళ్ళ వయసులో రమణి అమ్మాళ్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై(Chennai)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది . మంగళవారం రాత్రి సడెన్ గా గుండెపోటు(Heart Attack) రావడంతో చికిత్స తీసుకుంటూనే మరణించింది.

రమణి అమ్మాళ్ మరణంపై పలువురు తమిళ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. మొదట్లో జానపద పాటలతో గుర్తింపు రాగా, భరత్ ప్రేమిస్తే సినిమాలో ఓ పాటతో మరింత గుర్తింపు వచ్చింది. 2017లో తమిళ్ జీ సరిగమపలో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లి బాగా ఫేమస్ అయింది. పలు విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చి రాక్ స్టార్ రమణిగా తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది.. పుష్ప రాజ్ ఎక్కడ?

సింగర్ గా మంచి గుర్తింపు వచ్చినా ఆర్థికంగా మాత్రం బలపడలేదు. చివరి దశలో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ, ఇళ్లల్లో పనిచేస్తూ డబ్బులు సంపాదించుకునేది. రమణి అమ్మాళ్ ఇలా సడెన్ గా గుండెపోటుతో మరణించడంతో సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తమిళ ప్రముఖులు, నెటిజన్లు, సంగీత ప్రేమికులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.