Rambo in Afghanistan : ‘ఆఫ్ఘానిస్తాన్‌లో రాంబో’.. తాలిబన్ల నుంచి విడిపించడానికి..

‘రాంబో 3’ లోని సన్నివేశాలను తాలిబన్లకు అన్వయిస్తూ చేసిన నెట్టింట వీడియోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి..

Rambo Iii

Rambo in Afghanistan: ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితులు, కరెంట్ అఫైర్స్ మీద క్రియేటివ్‌గా మీమ్స్, ట్రోల్స్, సినిమా క్లిప్‌ల వంటి వాటితో సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. అందర్నీ ఆకట్టుకోవడానికి నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి క్రేజీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Bell Bottom : అక్షయ్ దెబ్బకి రూట్ మారుస్తున్న పాన్ ఇండియా సినిమాలు..

సిల్వస్టర్ స్టాలోన్ యాక్ట్ చేసిన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘రాంబో’ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సిల్వస్టర్ కెరీర్‌లో ఈ సినిమా స్పెషల్. ‘రాంబో’ ఫ్రాంఛైజీలో వచ్చిన సీక్వెల్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘రాంబో 3’ లోని సన్నివేశాలను తాలిబన్లకు అన్వయిస్తూ చేసిన నెట్టింట వీడియోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో.. అప్పట్లో ‘రాంబో 3’ లో సిల్వస్టర్ చేసిన యాక్షన్ సీన్లను ఇప్పటి సంఘటనకు జత చేశారు. ఆ మూవీలో కల్నల్ సామ్ ట్రౌట్‌ను సోవియట్ దళాలు బంధిస్తాయి. అతడిని ఆఫ్ఘాన్ కొండల్లో దాచి పెడతాయి. కల్నల్‌ను విడిపించి తీసుకెళ్లడానికి ‘రాంబో’ వస్తాడు.

ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్స్‌లో ఆఫ్ఘానిస్తాన్ సీన్స్ ఉన్నాయి. కల్నల్ సామ్ ట్రౌట్‌ ఓ సన్నివేశంలో.. మిడిల్ ఈస్ట్‌లో స్వేచ్ఛ పేరుతో యుద్ధం చెయ్యడం దుర్మార్గమని.. ఇక్కడి పేద ఫ్రీడం ఫైటర్ల ధాటికి మీ ఆయుధాలు నాశనం అవుతాయని అంటూ సోవియట్ సేనల్ని హెచ్చరిస్తాడు. ఈ వీడియోలో సిల్వస్టర్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.