RC16 Update : రామ్‌చ‌ర‌ణ్ RC16 అప్‌డేట్‌.. మైసూర్‌లో నేటి నుంచే షూటింగ్ ప్రారంభం!

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.

Ramcharan RC16 shooting starts from today in Mysore

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ లోగానే చ‌ర‌ణ్ త‌న కొత్త సినిమాని మొద‌లు పెట్ట‌నున్నాడు. RC16 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్ర మొద‌టి షెడ్యూల్ క‌ర్ణాక‌ట‌లోని మైసూర్‌లో జ‌ర‌గ‌నుంది. నేడు (న‌వంబ‌ర్ 22) నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే చిత్ర బృందం మొత్తం మైసూర్‌కు చేరుకుంది.

AHA : అల్లు అర్జున్ – బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ పార్ట్ 2 వ‌చ్చేసింది..

మైసూర్‌లోని చాముండేశ్వ‌రి మాతను చిత్ర ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారి పాదాల చెంత స్క్రిప్ట్‌ను ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. అమ్మ‌వారి ఆశీసుల‌తో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

మైసూర్‌లో దాదాపు 15 రోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఆ త‌రువాత హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తుండగా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ తో కలిసి మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Posani Krishna Murali : వైసీపీకి గుడ్ బై.. పవన్ తో సినిమా చేస్తా : పోసాని కృష్ణ మురళి