Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డు.. కాంట్రవర్సీ అమ్మడి ఎంట్రీ ఫిక్స్.. గ్లామర్ డబుల్ డోస్ తో ఇక రచ్చ రచ్చే!

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మంచి రేటింగ్ తోనే సాగుతోంది. గత సీజన్లతో పోల్చితే (Bigg Boss 9 Telugu)చప్పగానే సాగుతున్నప్పటికీ.. ఎంటర్టైన్మెంట్ మాత్రం అదే రేంజ్ లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Ramya Moksha to make wild card entry in Bigg Boss Season 9

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మంచి రేటింగ్ తోనే సాగుతోంది. గత సీజన్లతో పోల్చితే చప్పగానే సాగుతున్నప్పటికీ.. ఎంటర్టైన్మెంట్ మాత్రం అదే రేంజ్ లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్కుల విషయంలో కాకుండా కామనర్ వర్సెస్ సెలెబ్రెటీస్(Bigg Boss 9 Telugu) కావడంతో ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ మాత్రం నెలకొంది. కంటెస్టెంట్స్ కూడా గొడవలు, అలకలు, బిజ్జగింపులతో ఆడియన్స్ ను బాగానే మెప్పిస్తున్నారు. ఎక్కడైనా కాస్త జోష్ తగ్గింది అనిపిస్తే బిగ్ బాస్ ఉండనే ఉన్నాడు కదా కొత్త రచ్చ క్రియేట్ చేయడానికి.

OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఓజీ మ్యూజికల్ కాన్సర్ట్

ఇక బిగ్ బాస్ సీజన్ 9లో రెండవ వారం కూడా ముగియనుంది. మొదటివారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవగా.. రెండవ వారం మర్యాద మనీష్ ఇంటి నుండి బయటకు వెళ్లనున్నాడు. గతవారం మనోడి బిహేవియర్ చాలా మందికి ఇరిటేషన్ తెప్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆయనతో పాటు డేంజర్ జోన్ లో ప్రియాంక కూడా ఉంది. ఆమెకి కూడా వోటింగ్ చాలా తక్కువగా నమోదు అయ్యింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు బయటకు వెళ్తారు అనేది చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 9 మొదలై రెండు వారాలు గడుస్తున్న వేళ ఆడియన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. ఈ సీజన్ కి మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీకి రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9కి మరింత గ్లామర్ ని యాడ్ చేయాలనుకున్నారేమో కాంట్రవర్సీ బ్యూటీని రెడీ చేస్తున్నారు. ఆ బ్యూటీ మరెవరో కాదు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ అమ్మడి గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. రీల్స్ డాన్స్ చేస్తూ రచ్చే లేపే ఈ బ్యూటీ ఇటీవల తన వ్యాపారం వల్ల కాంట్రవర్సీ క్రియేట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ ఫేమ్ వల్లనే ఇప్పుడు ఆమె బిగ్ బాస్ సీజన్ 9కి ఎంట్రీ సాధించింది. రానున్న రెండు వారాలలో డబుల్ ఎలిమినేషన్ ను ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ ఎలిమినేషన్ తరువాత అంటే నాలుగవ వారం లేదా ఐదవ వారంలో ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈమె ఎంట్రీ తరువాత బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో చూడాలి.