OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఓజీ మ్యూజికల్ కాన్సర్ట్

ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఓజీ మ్యూజికల్ కాన్సర్ట్

Pawan kalyan OG Musical Concert in Hyderabad

Updated On : September 20, 2025 / 8:25 PM IST

OG: ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదల కానుంది. విడుదల డేట్ దగ్గదపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. వరుసగా సాంగ్స్, పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదల డేట్ ను కూడా విడుదల చేశారు.

OG: “వాషి యో వాషి” హైకూ మీనింగ్ ఇదే.. ఫైర్ పుట్టిస్తున్న గద్ద కథ

తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో తీపి కబురు చెప్పారు మేకర్స్. సెప్టెంబర్ 21న సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘ఓజీ’ కాన్సర్ట్‌ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఓజీ సినిమాలోని పాటల ప్రధానంగా ఈ వేడుక జరుగనుంది. అయితే, ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మిగతా చిత్ర యూనిట్‌ అంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎప్పుడు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బదులుగా ఈ ఈవెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by DVV Entertainment (@dvvmovies)