OG: “వాషి యో వాషి” హైకూ మీనింగ్ ఇదే.. ఫైర్ పుట్టిస్తున్న గద్ద కథ

సినిమా లవర్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు (OG)ఒకే ఒక సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ(ఓజాస్ గంభీర).

OG: “వాషి యో వాషి” హైకూ మీనింగ్ ఇదే.. ఫైర్ పుట్టిస్తున్న గద్ద కథ

Fire-making Washi Yo Washi Song Lyrics

Updated On : September 20, 2025 / 8:07 PM IST

OG: సినిమా లవర్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఒకే ఒక సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ(ఓజాస్ గంభీర). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ మూవీపై ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ (OG)ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవడలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా నుంచి విడుదలవుతున్న ఒక్కో అప్డేట్ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి “వాషి యో వాషి” సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. జాపనీస్ లిరిక్స్ వచ్చిన ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే, చాలా పవర్ఫుల్ గా ఉన్న ఈ లిరిక్స్ చాలా మందికి అర్థం కాలేదు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Mohanlal: మలయాళ స్టార్ మోహన్‌ లాల్‌ కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్

గద్దా ఓ గద్దా..

నువ్వో అడవి గద్దను చంపాలంటే..

ముందు దాని రెక్కలు తెగ నరకాలి..

అది నేల మీద పడ్డాక దాని కళ్లు పీకేయాలి..

అది గుడ్డిదైతే ఎటు పోవాలో దానికి తెలియదు..

అప్పుడు దాని కాళ్లు నరికితే ఇక ఎప్పటికీ కదలలేదు..

అప్పుడు దాని రాకాసి గుండెను బయటకు తీయాలి..

గద్దా ఓ గద్దా..

ఇవి చూశాక చాలా మంది ఫైర్ సాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం లిరిక్స్ యే ఈ రేంజ్ లో ఉన్నాయంటే సినిమాలో ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అనుకుంటున్నారు. ఇక ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.