Mohanlal: మలయాళ స్టార్ మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal)ను అత్యంత ప్రతిష్టాత్మమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.

Malayalam actor Mohanlal to be conferred with Dadasaheb Phalke Award
Mohanlal: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్ 20 శనివారం కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ చలన చిత్రరంగానికి ఆయన ఆదర్శవంతమైన సేవలను అందించారు. మోహన్‌లాల్ అద్భుతమైన ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని కొనిడియాడింది. సెప్టెంబర్ 23వ తేదీన జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మోహన్‌లాల్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. అలాగే 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్ దాదా ఈ అవార్డు వరించింది.
OG: ఓజీ కోసం 20 ఏళ్ళ రూల్ బ్రేక్ చేసిన పవన్.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటున్న తమన్
ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘వృషభ’. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. భారీ గ్రాఫిక్స్ తో, ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ తో వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం విజువల్స్ తో వండర్ క్రియేట్ చేసింది ఈ టీజర్. ఇక యోధుడిగా మోహన్ లాల్ లుక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా టాప్ నాచ్ ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.