×
Ad

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లో వైల్డ్ టాస్క్.. రమ్య తలకు గాయం.. ఇక ఆ ముగ్గురిలోనే ఒకరు

బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకి వైల్డ్ గా మారుతోంది. వైల్డ్ కార్డ్స్ (Bigg Boss 9 Telugu)ఎంట్రీ తరువాత అది మరింత ఎక్కువగా మారింది. నామినేషన్స్, టాస్కులు, గోడలు ఇలా ప్రతీదాంట్లో రచ్చ రచ్చ నడుస్తోంది.

Ramya suffers head injury during Bigg Boss Season 9 captaincy task

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకి వైల్డ్ గా మారుతోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తరువాత అది మరింత ఎక్కువగా మారింది. నామినేషన్స్, టాస్కులు, గోడలు ఇలా ప్రతీదాంట్లో రచ్చ రచ్చ నడుస్తోంది. టాస్కులలో విన్ అవడం కోసం కిందామీదా పడి కొట్టుకుంటున్నారు. (Bigg Boss 9 Telugu)తాజాగా అలా జరిగిన తోపులాటలో రమ్య తలకు గాయం అయ్యింది. దీంతో ఆమె ఆట నుంచి వైదొలగింది. ఇక ఈ వారం కాప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే చాలా రసవత్తరంగా మారింది.

Urmila Matondkar: ఊర్మిళ పరువపు వల.. ఎద అందాలకు కుర్రకారు విలవిల.. ఫోటోలు

ముందుగా ఈ వారమే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి కెప్టెన్ అయ్యే అవకాశాన్ని అందించాడు బిగ్ బాస్. కానీ, చివర్లో చిన్న మెలిక పెట్టాడు. ఆ కెప్టెన్సీ కంటెండర్షిప్ ని కాపాడుకునే బాధ్యత మీదే అని చెప్పాడు. అంటే, గేమ్ లో మిగతా కంటెస్టెంట్స్ పాత్ర కూడా ఉంటుందని అర్థం. ఇక గేమ్ విషయానికి వస్తే, గార్డెన్‌ ఏరియాలో బాల్‌తో గోల్‌ చేయాలి అనే వైల్డ్ టాస్క్ ఇచ్చాడు. అసలే వైల్డ్ టాస్క్ కావడంతో అది మరింత వైల్డ్ గా మారింది. గేమ్ స్టార్ట్ అవగానే అందరూ పోటాపోటీగా తమ ఎదురుగా ఉన్న కోర్టులో గోల్ చేయడానికి చాలా కష్టపడ్డారు.

ఒకరినొకరు తోసుకుంటూ కిందామీదా పడ్డారు. మరోపక్క భరణిని అదుపు చేసే సమయంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో ఆమె తలకు చిన్న గాయం అయినట్టు కనిపించింది. దాంతో ఆమె గేమ్ నుంచి తప్పుకుంది. గాయాలు అవుతుండటంతో వయొలెన్స్‌ వద్దని వైల్డ్‌ కార్డ్స్‌ కంటెస్టెంట్స్ అన్నారు. కానీ, అది స్టార్ట్ చేసింది మీరే కదా అంటూ కౌంటర్ ఇచ్చింది తనూజ. అలా వైల్డ్ గ సాగిన ఈ గేమ్స్‌ లో చివరగా సుమన్‌, గౌరవ్‌ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఇక గతవారం నాగార్జున ఇచ్చిన పవర్‌ తో నిఖిల్‌ కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. కాబట్టి, ఈ ముగ్గురిలో ఒకరు ఈవారం కెప్టెన్‌ కానున్నారు.