Ramya Krishna
Prabhas’s Salaar : రెబల్‌స్టార్ ప్రభాస్ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తర్వాత షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఈ సమయంలో లేటెస్ట్‌గా సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ కథనాయిక కాగా.. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్ అక్కగా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్‌కు అమ్మగా శివగామిగా పవర్‌ఫుల్ పాత్రలో నటించగా.. ఇప్పుడు అక్కగా మరో పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నట్లుగా చెబుతున్నారు.
హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో ఆమె ‘లైగర్’, ‘రిపబ్లిక్’ సినిమాల్లో నటిస్తోంది. అందులో కూడా రమ్యకృష్ణది పవర్‌ఫుల్ పాత్రలే.