Ramyakrishna went to Roja home in Nagari roja says traditional sendoff to Ramyakrishna photos and videos shared
Roja Ramyakrishna : ఒకప్పటి నటి రోజా, ప్రస్తుతం మంత్రిగా ఏపీ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో ఎక్కువగా తన నియోజకవర్గమైన నగరిలోనే నివాసం ఉంటున్నారు. ఇక సినిమా, టీవీ వాళ్ళు ఎవరికి తిరుపతి దర్శనం కావాలన్నా రోజా దగ్గరుండి మరీ అరేంజ్ చేస్తున్నారు. తాజాగా రమ్యకృష్ణ తిరుపతికి తన కుమారుడితో వచ్చి దర్శనం చేసుకుంది. అనంతరం నగరిలోని రోజా ఇంటికి వెళ్ళింది రమ్యకృష్ణ.
రోజా ఇంట్లో రమ్యకృష్ణ కాసేపు ఉండి రోజాతో ముచ్చటించింది. రోజా తన ఇంటిని అంతా రమ్యకృష్ణకు చూపించింది. వెళ్లేముందు రోజా రమ్యకృష్ణకు స్పెషల్ గా బొట్టు పెట్టి, చీర పెట్టి పంపించింది. అలాగే తనతో దిగిన ఫోటోలు, రమ్యకృష్ణకు చీర పెట్టిన వీడియోని రోజా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలని షేర్ చేస్తూ రోజా ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Salaar : బాలీవుడ్‌లో సలార్ కష్టమేనా? అసలు బాలీవుడ్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తారా?
రోజా తన పోస్ట్ లో.. మంచి స్నేహితులు నక్షత్రాల లాంటి వాళ్ళు. దగ్గరగా చూడకపోయినా అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయి. ఈ రోజు నా ఇంటికి వచ్చి చాలా అందంగా మార్చిన నా స్టార్ కి స్వాగతం. ఆ రోజుల్లో జీవితం ఎలా ఉండేదో, ఆ చిరునవ్వులు, మన వర్క్ అన్ని గుర్తు చేసుకొని సమయం గడిచిపోయింది. నా బెస్టీ రమ్యకృష్ణతో మళ్ళీ కనెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది. దీంతో రోజా చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారగా వీరిద్దరూ ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.