Rana Daggubati : రానా దగ్గుబాటి హోస్ట్ గా మరో సరికొత్త టాక్ షో.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?

తాజాగా రానా మరో కొత్త టాక్ షోతో రాబోతున్నాడు.

Rana Daggubati Coming with New Talk Show in OTT Here the Streaming Details

Ran Daggubati : రానా దగ్గుబాటి ఓ పక్క నటుడిగా చేస్తూనే మరో పక్క హోస్ట్ గా, బిజినెస్ మెన్ గా బిజీగా ఉంటాడు. ఆల్రెడీ గతంలో రానా నెంబర్ 1 యారి అనే టాక్ షోతో మెప్పించాడు. తాజాగా రానా మరో కొత్త టాక్ షోతో రాబోతున్నాడు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కొత్త షో మొదలుకానుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోయాయి.

Also Read : Satya Sri : సొంతింట్లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ నటి.. సత్యశ్రీ గృహప్రవేశం.. ఫొటోలు వైరల్..

తాజాగా దీని గురించి అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో ఈ కొత్త టాక్ షో రానుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ షో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోని రానానే నిర్మాతగా తన స్పిరిట్ మీడియాపై నిర్మించాడు. ఇప్పటికే ఆర్జీవీ, రాజమౌళి, పలువురు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు షూటింగ్ పూర్తయినట్టు సమాచారం.

మరి ఈ కొత్త టాక్ షో ది రానా దగ్గుబాటి షో ఎలా ఉంటుందో, సినీ సెలబ్రిటీలు ఎన్ని ఆసక్తికర విషయాలు చెప్తారో చూడాలి. రానా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఈ టాక్ షో కోసం ఎదురుచూస్తున్నారు.