Rana Completes Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో సినీ ప్రముఖులు భారీగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ ప్రకృతి ప్రేమికులుగా మారుతున్నారు. అనంతరం పర్యావరణానికి చెట్లు ఎంత ఉపయోగకరమైనవో తెలుపుతూ వేరొకరిని నామినేట్ చేస్తూ ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన ‘బాహుబలి’ ప్రభాస్.. భళ్లాలదేవుడు దగ్గుబాటి రానాను నామినేట్ చేశారు.
ఇన్నాళ్లూ పెళ్లి పనులతో బిజీగా ఉన్న రానా తాజాగా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. రామానాయుడు స్టూడియోలో మూడు మొక్కలు నాటారాయన. ‘సమాజానికి మేలు చేసే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డార్లింగ్ ప్రభాస్‌కు, శృతీహాసన్‌కు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో నా అభిమానులు, ప్రకృతి ప్రేమికులందరూ పాల్గొని ఈ ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలి. అంతేకాదు.. ఎవరు మొక్కలు నాటి నన్ను ట్యాగ్ చేసినా రీ ట్వీట్ చేస్తాను’ అని రానా తెలియజేశారు.
Little delayed but here are 2 one for the #Adipurush #Prabhas and the other for The rockstar @shrutihaasan here you go!! #GreenIndiaChallenge nominating everyone who follows me and has the means to….go for it! RT for a greener India!! pic.twitter.com/NnsN1pNpsa
— Rana Daggubati (@RanaDaggubati) August 20, 2020