Rana Daggubati : ఇదొక చెత్త అనుభవం.. మొన్న బ్రహ్మాజీ, అనసూయ, ఇవాళ రానా దగ్గుపాటి.. అసలు విషయమేంటి?

ఈమధ్య కాలంలో టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు ఆ సంస్థలు నుంచి చేదు అనుభవాలని ఎదురుకున్నాము అంటూ సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్న బ్రహ్మాజీ, అనసూయ, ఇవాళ రానా దగ్గుపాటి..

Rana Daggubati fires on indigo airline services

Rana Daggubati : ఈమధ్య కాలంలో కొందరు సినీ ప్రముఖులు.. కొన్ని విమానయాన సంస్థల పనితీరుతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మాజీ, అనసూయ.. ప్రముఖ విమానయాన సంస్థ అయిన ‘అలియాన్స్ ఎయిర్’ సేవలతో చేదు అనుభవాలని ఎదురుకున్నారు. ఆ తరువాత ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.

Rana Daggubati : రానాకి పాపా పుట్టిందా?? వైరల్ అవుతున్న మిహికా పోస్ట్.. అసలు మ్యాటర్ ఏంటంటే??

తాజాగా టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి కూడా అలాంటి అనుభవాన్ని ఎదురుకున్నాడు. తన కుటుంబంతో కలిసి నేడు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన రానా.. ఇండిగో ఏయిర్ లైన్స్ సంస్థలో టికెట్స్ బుక్ చేసుకున్నాడు. అయితే తాను బుక్ చేసుకున్న ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో, మరో ఫ్లైట్ లో బెంగళూరుకి తరలించారు సిబ్బంది. అయితే బెంగుళూరులో దిగాకా, వారి లగేజ్ ఇంకో విమానంలో వస్తుందంటూ సిబ్బంది సమాచారం ఇచ్చింది.

బెంగళూరు చేరుకున్నాక ఎంతసేపటికి లగేజి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రానా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాడు. “షెడ్యూల్ చేసిన విమానాలు ల్యాండ్ కాకపోవచ్చు లేదా టేకాఫ్ కాకపోవచ్చు. ఇండిగో ఇంజనీర్లు బహుశా మంచి సిబ్బందే కావచ్చు, కానీ వారికి సరైన సూచనలు చేయడం అవసరం. ప్రయాణికులు లగేజ్ ఎక్కడ ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఇదొక చెత్త అనుభవం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.