Rana Daggubati : ఆ హీరో కోసం అఘోరా క్యారెక్టర్ చేసిన రానా.. అదరగొట్టేసాడంట..

ఓ హీరో కోసం రానా ఆ హీరో సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసాడు.

Rana Daggubati Plays a Special Guest Appearance Role in Love Mouli Movie

Rana Daggubati : రానా దగ్గుబాటి.. యాక్టర్ గానే కాక ఎన్నో క్రాఫ్ట్స్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. మరోవైపు బిజినెస్ లు కూడా చేస్తాడు. ఇక సినీ పరిశ్రమలో రానాకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ సినిమాల కోసం రానా ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాడు. తాజాగా ఓ హీరో కోసం రానా ఆ హీరో సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసాడు.

నవదీప్, రానా మంచి స్నేహితులు. నవదీప్(Navdeep) చాలా రోజుల తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకు లవ్ మౌళి(Love Mouli) సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్స్, ట్రైలర్స్ లో కొంచెం బోల్డ్ గా చూపించినా ప్రేమ గురించి కొత్తగా చెప్తాము అని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 7న విడుదల కానుంది. ఇప్పటికే లవ్ మౌళి సినిమాకు పలు ప్రీమియర్ షోలు వేశారు.

Also Read : Sharwanand : ఇకపై శర్వానంద్ స్టార్ ట్యాగ్ అదే.. శర్వా పేరు ముందు ఏం స్టార్ వేశారో తెలుసా..?

ఈ ప్రీమియర్ షోల నుంచి మంచి స్పందన వస్తుంది. నవదీప్ తో పాటు హీరోయిన్ పంఖురి గిద్వాని కూడా యాక్టింగ్ అదరగొట్టేశారని అభినందనలు వస్తున్నాయి. అయితే ఈ ప్రీమియర్ షోల నుంచి ఓ న్యూస్ లీకైంది. లవ్ మౌళి సినిమాలో హీరో రానా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడట. హీరో రానా అఘోర వేషం వేసాడని, రానాకు, నవదీప్ కి మధ్య సీన్స్ కూడా ఉన్నాయని సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రానా క్యారెక్టర్ అదిరిపోతుంది, భయపెడుతుందని చెప్తున్నారు. దీంతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినందుకు, నవదీప్ కోసం గెస్ట్ అప్పీరెన్స్ చేసినందుకు మరోసారి రానాని అభినందిస్తున్నారు..

అయితే రానాని ఆ అఘోర వేషంలో గుర్తుపట్టలేకపోతున్నామని, అంతగా ఛేంజ్ అయ్యాడని, అసలు అతను రానా అవునా కదా అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.