Rana Daggubati Reacts on Sandeep Reddy Vanga Deepika Padukone Working Hours Issue
Rana Daggubati : ఇటీవల సందీప్ వంగ – ప్రభాస్ స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా అనుకున్నారు. సందీప్ కథ చెప్పగా దీపికా ఓకే చెప్పిందని సమాచారం. కానీ తర్వాత దీపికా రోజుకి 6 నుంచి 8 గంటలు మాత్రమే పనిచేస్తాను, 40 కోట్ల రెమ్యునరేషన్ కావాలి, ప్రాఫిట్స్ లో షేర్ కావాలి, తెలుగు డబ్బింగ్ చెప్పను.. లాంటి పలు కండిషన్స్ పెట్టిందట. దీంతో సందీప్ దీపికాని తప్పించి త్రిప్తి డిమ్రి ని హీరోయిన్ గా అనౌన్స్ చేసారు.
అయితే దీపికా తన పీఆర్ టీమ్ తో త్రిప్తిపై, సందీప్ పై బాలీవుడ్ లో నెగిటివ్ ప్రచారం చేయించిందని సమాచారం. దీనిపై సందీప్ వంగ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ డర్టీ పీఆర్ గేమ్, నా స్పిరిట్ స్టోరీ లైన్ కూడా లీక్ చేసారు అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో దీపికా – సందీప్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే బాలీవుడ్ దీపికాకు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది దీపికా వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడుతూ ఆమెని సపోర్ట్ చేస్తున్నారు.
Also Read : Manchu Vishnu Kannappa Event : గుంటూరులో మంచు విష్ణు ‘కన్నప్ప’ ప్రమోషనల్ ఈవెంట్.. ఫొటోలు..
తాజాగా రానా దగ్గుబాటి రానా నాయుడు ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి మాట్లాడుతూ, వర్కింగ్ అవర్స్ పై స్పందిస్తూ ఇండైరెక్ట్ గా సందీప్ వంగకు సపోర్ట్ చేసాడు.
రానా మాట్లాడుతూ.. వర్క్ లైఫ్ – పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. కానీ మాకు సినిమా అనేది పని కాదు ఒక లైఫ్ స్టైల్. వర్కింగ్ అవర్స్ అనేవి సినిమాని బట్టి, వర్కింగ్ ప్లేస్ ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ కూడా ఉంది. బాలీవుడ్ లో 9 గంటలకు షూట్ మొదలుపెడతారు. తెలుగులో ఉదయం 7 గంటలకే షూట్ స్టార్ట్ చేస్తాం. అలాగే షూటింగ్ జరిగే ప్రదేశం, సెట్, నగరం.. ఇలాంటివన్నీ కూడా వర్కింగ్ అవర్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఒక రోజులో రెండు షూట్ లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరూ ఎవర్ని ఇన్ని గంటలు పనిచేయమని బలవంతం చేయరు. ఇది ఒక ఉద్యోగం లాంటిది. మిమ్మల్ని బలవంతంగా ఉద్యోగం చేయించడం సాధ్యం కాదు. ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది. రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేసే నటులు కూడా ఉన్నారు అని తెలిపారు.
Also Read : Anchor Sravanthi Chokarapu : గోవాలో యాంకర్ స్రవంతి.. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్..
మన టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే చాలా మంది స్టార్స్ రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో 16 గంటలు కూడా పనిచేస్తారు. కొంతమంది ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్ కూడా చేస్తారు. అయితే అదంతా వారి ఇష్టం, సినిమాపై మీద ఉన్న ఇష్టంతో ఆధారపడి ఉంటుంది. సినిమా అనేది 9-5 జాబ్ కాదని, షూటింగ్, లొకేషన్, సీన్స్ టైమింగ్ ని బట్టి షూట్ జరుగుతుంది అని గతంలో పలువురు సెలబ్రిటీలు అనేకమార్లు తెలిపారు.