Rana Daggubati : గర్వంగా ఉందంటున్న రానా భార్య మిహీకా.. ఎందుకో తెలుసా..?
తెలుగు సినిమాని సరిహద్దులు దాటించి ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న రానా చూస్తుంటే.. టాలీవుడ్ లో ఎవరికైన గర్వంగానే ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిని భర్తగా పొందిన భార్య మిహీకాకి..

Rana Daggubati wife Miheeka Bajaj instagram post viral
Rana Daggubati : టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి.. సౌత్ టు నార్త్ హీరోగా, విలన్‌గా, నిర్మాతగా సినిమా రంగానికి ఏ విధంగా సేవలు కావాలో ఆ విధంగా అందిస్తూ తనతో పాటు సినీ పరిశ్రమను కూడా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ప్రభాస్ వంటి హీరో సినిమాకి ఇంటర్నేషనల్ వేదిక పైకి వెళ్ళడానికి కూడా రానా సహాయం కావాలంటే.. సినీ పరిశ్రమలో రానా స్థానం ఏంటో అర్ధం చేసుకోండి.
తెలుగు సినిమాని సరిహద్దులు దాటించి ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న రానాని చూస్తుంటే.. టాలీవుడ్ లో ఎవరికైన గర్వంగానే ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిని భర్తగా పొందిన భార్య మిహీకాకి ఇంకెంతటి గర్వంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆమె తన భర్త గురించి ఒక పోస్ట్ వేశారు. “కంగ్రాట్యులేషన్స్ మై బ్యూటిఫుల్. నువ్వు నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తున్నావు. నీ భార్యగా నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ పోస్ట్ వేశారు. ఇంతకీ ఆమె ఈ పోస్టు దేని గురించి వేశారు..?
ప్రముఖ దుబాయ్ సంస్థ.. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లో వచ్చే కంటెంట్‌కి ‘డానుబే ఓటీటీ ప్లే అవార్డ్స్’ పేరిట అవార్డులు అందిస్తుంటారు. బాలీవుడ్ లో జరిగిన ఈ అవార్డుల వేడుకలో చాలామంది స్టార్స్ అవార్డులు అందుకున్నారు. ఇక ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కి గాను ‘మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డుని రానా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూనే మిహీకా.. ‘ప్రౌడ్ వైఫ్’ అంటూ పోస్టు వేశారు.
Also read : Salman and Ronaldo: సల్మాన్ ఖాన్‌ను రొనాల్డో నిజంగానే పట్టించుకోలేదా? ఆసక్తికర నిజం బయటికి వచ్చింది
ఇక రానా నాయుడు విషయానికి వస్తే.. బాలీవుడ్ లో బాగానే వర్క్ అవుట్ అయ్యింది. కానీ సౌత్ లో ఫ్యామిలీ స్టార్ అయిన వెంకటేష్ ని బోల్డ్ క్యారెక్టర్ లో చూడలేకపోయారు. తోటి యాక్టర్స్ నుంచి కూడా చాలా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో సెకండ్ సీజన్ లో మళ్ళీ అటువంటి ఫీడ్ బ్యాక్ రాకుండా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు, ఈసారి ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఈ సిరీస్ నచ్చుతుందని వెంకటేష్ తెలియజేశాడు.