పవన్‌తో రానా.. క్రేజీ కాంబినేషన్‌..

Rana Daggubati: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల క్రేజీ కలయికలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తెరకెక్కనుంది. మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్, బిజూ మీనన్ క్యారెక్టర్ చేస్తుండగా.. రానా, పృథ్వీ రాజ్ పాత్రలో కనిపించనున్నారు. రానా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

2021 జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానుంది. సమర్పణ : పిడివి ప్రసాద్, సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్, నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ.