Rana-Mihika couple to become parents
Rana-Mihika: టాలీవుడ్ హీరో రానా తండ్రి కాబోతున్నాడా అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రానా భార్య మిహిక కన్సీవ్ అయ్యారని, త్వరలోనే ఈ విషయాన్ని దగ్గుబాటి ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇక చాలా కాలం తరువాత దగ్గుబాటి(Rana-Mihika) వారింట శుభవార్త వినిపించడంతో ఫ్యామిలీ అంత సంబరాలు చేసుకుంటున్నారట. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Rashmika Mandanna: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన రష్మిక.. అందరికీ తెలుసు కదా.. అంతే.. అంతే..
ఇక సినిమాల విషయానికి వస్తే, రానా ప్రస్తుతం నటన కంటే నిర్మాణంలోనే ఎక్కువ బిజీగా గా గడుపుతున్నాడు. రానా నాయుడు సీజన్ 2 తరువాత మరో సినిమాను ప్రకటించలేదు రానా. ఇక ఆయన విలన్ గా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న విడుదల కానుంది. రెండు భాగాలు కలిసి వస్తున్న ఈ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి స్పందన ఇస్తారో చూడాలి.