Rashmika Mandanna: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన రష్మిక.. అందరికీ తెలుసు కదా.. అంతే.. అంతే..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక ఎంగేజ్ మెంట్ (Rashmika Mandanna)జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి ప్రకటన లేకుండా నిశ్చితార్ధం చేసుకొని ఆడియన్స్ కి షాక్కిచ్చారు ఈ జంట.
Bhuvan Gowda,Bhuvan Gowda wedding,Bhuvan Gowda wedding photos
Rashmika Mandanna: రౌడీ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం (Rashmika Mandanna)తెలిసిందే. ఎలాంటి ప్రకటన లేకుండా నిశ్చితార్ధం చేసుకొని ఆడియన్స్ కి షాక్కిచ్చారు ఈ జంట. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎలాంటి హడావుడి లేకుండా ఈ తంతు జరిగింది. అయితే, ఈ ఎంగేజ్మెంట్ పై విజయ్ గానీ, రష్మిక గానీ ఇప్పటివరకు స్పందించలేదు. అలాగని, ఖండిస్తూ కూడా ప్రకటన చేయలేదు. దీంతో, వీరి ఎంగేజ్మెంట్ జరగడం నిజమేనని నమ్మేస్తున్నారు.
Bhuvan Gowda: కేజీఎఫ్, సలార్ మూవీస్ కెమెరామెన్ భువన్ గౌడ పెళ్లి ఫోటోలు.. సందడి చేసిన తారలు..
ఇదిలా ఉంటే, రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి కీ రోల్ చేస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే అక్టోబర్ 25న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా ఎంగేజ్మెంట్ తరువాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది రష్మిక. అయితే, మీడియా నుంచి వస్తుంది అనుకున్న ప్రశ్న యాంకర్ నుంచి వచ్చింది.
ముందుగా యాంకర్.. ఒక వ్యక్తిని బాయ్ ఫ్రెండ్‌గా ఎంచుకోవాలని ఎలా జడ్జ్ చేయాలని అని అడుగుతుంది. దానికి ప్రేక్షకుల నుంచి.. విజయ్ దేవరకొండని అడిగితే చెప్తారని అనే కామెంట్ వచ్చింది. దానికి రష్మిక కూడా నవ్వుతూ నవ్వుతు సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తరువాత రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది అని యాంకర్ మరో ప్రశ్న అడిగింది. దానికి మళ్లీ ఆడియన్స్ నుంచి రౌడీ(విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తి అనే ఆన్సర్ వచ్చింది. అప్పుడు కూడా రష్మిక చిరునవ్వుతూ.. అందరికీ తెలుసు.. అంతే.. అంతే.. అనుకుంటూ చేయి ఊపుతూ కనిపించింది. దీంతో, విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్మెంట్ గురించి చెప్పకనే చెప్పేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
