Rana – Samantha : రానా – సమంత కలిసి నటించిన సినిమా చూసారా? ఇప్పుడు తెలుగులో రిలీజ్..

రానా, సమంత కలిసి ఒక సినిమా చేశారని చాలా తక్కువ మందికి తెలుసు.

Rana Samantha Bangalore Naatkal Released in OTT Details Here

Rana – Samantha : రానా, సమంత కలిసి ఒక సినిమా చేశారని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఆ సినిమా తీసింది తెలుగులో కాదు కన్నడలో. ఆర్య, బాబీ సింహ, రానా, పార్వతి తిరువొతు, శ్రీ దివ్య, సమంత, లక్ష్మి రాయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన కన్నడ సినిమా ‘బెంగళూరు నాట్కళ్’. ఈ సినిమాని మలయాళం సూపర్ హిట్ సినిమా బెంగళూరు డేస్ కి రీమేక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసాడు.

Also Read : Rashmika Mandanna Sister : రష్మికకు ఇంత క్యూట్ చిన్ని చెల్లి ఉందని తెలుసా? ఏకంగా 16 ఏళ్ళు గ్యాప్..

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బెంగళూరు నాట్కళ్ సినిమా 2016లో కన్నడలో రిలీజయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. బెంగుళూరు డేస్ పేరుతో ఈ సినిమాని కొన్ని రోజుల క్రితమే డబ్బింగ్ చేసినా ఇప్పుడు డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమాలో సమంత కాసేపే కనిపిస్తుంది. రానా – సమంత మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుండటంతో సమంత ఫ్యాన్స్ ఈ సినిమాని చూసేస్తున్నారు. మీరు కూడా రానా – సమంత సినిమా బెంగుళూరు డేస్ అమెజాన్ ఓటీటీలో చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు