Ranaveer Singh Deepika Padukone Wedding Video Released after five Years of Marriage
Deepika Ranveer Wedding Video : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కొన్నాళ్ళు రిలేషన్ లో ఉండి 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు రిలీజ్ చేశారు కానీ వీడియో మాత్రం రిలీజ్ చేయలేదు. తాజాగా ఈ జంట బాలీవుడ్(Bollywood) హిట్ షో కాఫీ విత్ కరణ్(Koffee with Karan) 8వ సీజన్ లో మొదటి ఎపిసోడ్ కి వచ్చారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ మొదటి ఎపిసోడ్ లో రణవీర్ సింగ్, దీపికా పదుకొనే వచ్చి సందడి చేశారు. ఈ ఇద్దరూ ఫుల్ యాక్టివ్ గా, సరదాగా, రొమాంటిక్ గా ఉండి షోలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు తమ సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి, మ్యారేజ్ గురించి తెలిపారు. అలాగే ఇన్నాళ్లు రిలీజ్ చేయని తమ మ్యారేజ్ వీడియోని కూడా ఈ షో ద్వారా రిలీజ్ చేశారు. పెళ్లి అయిన అయిదేళ్ల తర్వాత రిలీజ్ చేయడంతో ఇప్పుడు దీపికా రణవీర్ పెళ్లి వీడియో వైరల్ గా మారింది.
ఇక వీరి లవ్ స్టోరీ గురించి కూడా తెలిపారు. రణవీర్ సింగ్ కొనుక్కొని మాల్దీవ్స్ లో దీపికా పదుకొనేకి 2012లో ప్రపోజ్ చేసాడట. అప్పటికే దీపికా పదుకొనే బ్రేకప్ అయి ఉండటంతో కొన్ని రోజుల తర్వాత దీపికా ఇండైరెక్ట్ గా ఓకే చెప్పి కొన్ని రోజులు డేటింగ్ చేస్తూ ట్రావెల్ చేద్దాం అనుకుంది. దీంతో మూడేళ్లు దీపికా రణవీర్ డేటింగ్ చేసిన తర్వాత రణవీర్ నిశ్చితార్థం చేసుకుందామని అడగడంతో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా 2015లో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2018 లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.