Ranbir – Alia : కూతురి ఫేస్ రివీల్ చేసిన రణబీర్, అలియా.. ముత్తాత పోలికలే అంటున్న ఫ్యాన్స్..

క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో రహా పేస్ ని అభిమానులకు చూపించిన రణబీర్ అలియా. రహాని చూసిన ఫ్యాన్స్ ముత్తాత పోలికలే అంటూ..

Ranbir Kapoor Alia Bhatt reveal their daughter face to fans

Ranbir Kapoor – Alia Bhatt : బాలీవుడ్ సెలబ్రిటీస్ రణబీర్ కపూర్, అలియా భట్ 2022లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి అయిన ఏడు నెలలకే ఇద్దరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకున్నారు. నవంబర్ 6న అలియా.. రాహాకు జన్మనిచ్చారు. అప్పటి నుంచి ఈ స్టార్ కపుల్ రహా ఫేస్ ని రివీల్ చేయలేదు. తాజాగా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో రహా ఫేస్ ని అభిమానులకు చూపించారు.

మొదటిసారి రహాని తీసుకోని రణబీర్, అలియా కెమెరా ముందుకు వచ్చారు. ప్రస్తుతం రహాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇవి చూసిన అభిమానులు రహాకు ముత్తాత పోలికలే వచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు రాజ్ కపూర్‌కి రణబీర్ మనవడు అని అందరికి తెలిసిందే. రాజ్ కపూర్‌కి బ్లూ ఐస్ (Blue Eyes) ఉంటాయి.

Also read : సోదరుడి పెళ్ళిలో సల్మాన్ ఖాన్ స్టెప్పులు.. వీడియో వైరల్..

ఇప్పుడు రహా కళ్ళు కూడా సేమ్ అలానే ఉన్నాయి. ఈ కళ్ళని చూపించే.. అభిమానులు రహాకు ముత్తాత పోలికలే వచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ బ్లూ ఐస్ తో క్యూట్ గా కనిపిస్తున్న రహా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోతుంది. తన ఎంట్రీతో సోషల్ మీడియా టైంలైన్ నిండిపోయింది. మరి రహాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను మీరు కూడా చూసేయండి.

ఇక రణబీర్ విషయానికి వస్తే.. రీసెంట్ గా ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఈ చిత్రం నాన్న సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటివరకు 860 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. 2024 జనవరి 26న ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. ఓటీటీలోకి మరో 8 నిమిషాల అదనపు సన్నివేశాలతో తీసుకు రాబోతున్నట్లు సందీప్ వంగ తెలియజేశారు.