×
Ad

Ranbir Kapoor – Alia Bhatt : భార్య చెప్పులు మోసిన రణ్‌బీర్‌.. తప్పంటూ నెటిజెన్లు ట్రోల్.. రీజన్ ఏంటి?

అలియా భట్ చెప్పులు మోసినందుకు రణ్‌బీర్‌ ని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. భార్య చెప్పులు భర్త మోస్తే తప్పేంటి అనుకుంటున్నారా? అయితే అసలు కథ తెలుసుకోండి.

Ranbir Kapoor getting trolled to carry Alia Bhatt slippers

Ranbir Kapoor – Alia Bhatt : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్.. అన్యోన్యతను చూస్తే అందరికి చాలా ముచ్చట వేస్తుంది. దీంతో వీరిద్దరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. తాజాగా రణ్‌బీర్‌ తన భార్య అలియా చెప్పులు మోసిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఆ వీడియోని చూసిన కొందరు నెటిజెన్స్ రణ్‌బీర్‌ ని ట్రోల్ చేస్తున్నారు. భార్య చెప్పులు భర్త మోస్తే ట్రోల్ చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా?

Alia Bhatt : యాక్టింగ్ గురించి సలహా అడిగితే.. రాజమౌళిపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు..

అసలు విషయం ఏంటంటే.. ఇటీవల బాలీవుడ్ ఫిలిం మేకర్ ఆదిత్య చోప్రా తల్లి కన్నుమూశారు. దీంతో ఆదిత్య చోప్రా కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు బాలీవుడ్‌ ప్రముఖులంతా ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే రణ్‌బీర్‌ అండ్ అలియా కూడా ఆదిత్య చోప్రా ఇంటికి వచ్చారు. అలియా ఇంటి లోనికి వెళ్లే ముందు తన చెప్పులు గుమ్మం ముందు విడిచి లోపలికి వెళ్ళింది. అయితే వెనుకే వచ్చిన రణ్‌బీర్‌ తన చేతులతో ఆ చెప్పులను పట్టుకొని ఇంటిలోనికి తీసుకెళ్లి పెట్టాడు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది.

Ranbir Kapoor : నేను మంచి భర్తను కాదు.. రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యలు

రణ్‌బీర్‌ ఆ చెప్పులను తీసుకువెళ్లి ఇంటిలోని దేవుడి మందిరం ఎదురుగా పెట్టాడు. అంతేకాకుండా రణ్‌బీర్‌ చెప్పులు విడవకుండా మందిరం పక్కన నుంచి ఇంటిలోనికి వెళ్ళాడు. ఇది చూసిన కొందరు నెటిజెన్లు ఇలా కామెంట్ చేస్తున్నారు.. అలియా ఆలోచించే తన చెప్పులను బయట మెట్లు ముందు విడిచి లోపలి వెళ్ళింది. కానీ రణ్‌బీర్‌ ఆ చెప్పులను మందిరం ముందు పెట్టడమే కాకుండా, తన చెప్పులు కూడా విడవకుండా లోపలి వెళ్ళిపోయాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.