Brahmastra Movie : బ్రహ్మాస్త్ర 2 ఎప్పుడు? క్లారిటీ ఇచ్చిన రణబీర్.. అబ్బో చాలా టైం ఉందిగా..

బ్రహ్మాస్త్ర 1 సినిమా వచ్చి సంవత్సరం దాటేస్తున్నా ఇప్పటివరకు పార్ట్ 2 పై ఎలాంటి సమాచారం. తాజాగా రణబీర్ కపూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర 2 పై క్లారిటీ ఇచ్చాడు.

Ranbir Kapoor gives Clarity on Brahmastra part 2 Movie

Brahmastra Movie  : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్(Alia Bhatt) జంటగా, అమితాబ్, మౌని రాయ్, నాగార్జున, షారుఖ్.. ముఖ్య పాత్రలతో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర పార్ట్ 1. గత సంవత్సరం సెప్టెంబర్ 9న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ చేశారు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. కలెక్షన్స్ మాత్రం దాదాపు 400 కోట్లు వసూలు చేసింది బ్రహ్మాస్త్ర పార్ట్ 1.

ఈ సినిమాకు ఇంకో రెండు పార్టులు కూడా ఉన్నాయని అప్పుడే ప్రకటించారు. బ్రహ్మాస్త్ర 1 సినిమా వచ్చి సంవత్సరం దాటేస్తున్నా ఇప్పటివరకు పార్ట్ 2 పై ఎలాంటి సమాచారం. తాజాగా రణబీర్ కపూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర 2 పై క్లారిటీ ఇచ్చాడు.

Also Read : Viva Harsha : వామ్మో కమెడియన్ వైవా హర్ష దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయా? చిన్న సైజు ధోని గ్యారేజ్‌లా ఉందే..

రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర 2 కి రైటింగ్ వర్క్ ఇంకా చాలా చేయాలి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతం. అయాన్ ఆల్రెడీ కథని రెడీ చేశాడు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 పదింతలు భారీగా ఉండబోతుంది. అయితే అయాన్ ప్రస్తుతం వార్ 2 సినిమాకి పనిచేస్తున్నాడు. ఆ సినిమా అయ్యాకే బ్రహ్మాస్త్ర 2 ఉంటుంది. 2025 మొదట్లో బ్రహ్మాస్త్ర 2 సినిమా వర్క్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని తెలిపారు. దీంతో అబ్బో ఇంకా చాలా టైం ఉంది కదా అని భావిస్తున్నారు అభిమానులు. ఇక రణబీర్ త్వరలో సందీప్ వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాతో రాబోతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు