Viva Harsha : వామ్మో కమెడియన్ వైవా హర్ష దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయా? చిన్న సైజు ధోని గ్యారేజ్‌లా ఉందే..

హర్షకు కాలేజీలో చదివేటప్పుడు నుంచే బైక్స్(Bikes) అంటే పిచ్చి. అప్పుడప్పుడు బైక్ రేసింగ్స్ లో కూడా పాల్గొన్నాడు. సక్సెస్ అయ్యాక, డబ్బులు సంపాదించుకున్నాక తనకి ఇష్టమైన బైక్స్ అన్ని కొనుక్కుంటున్నాడు.

Viva Harsha : వామ్మో కమెడియన్ వైవా హర్ష దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయా? చిన్న సైజు ధోని గ్యారేజ్‌లా ఉందే..

Viva Harsha maintain So Many Bikes Photos Goes Viral

Updated On : October 25, 2023 / 10:16 AM IST

Viva Harsha :  సాధారణంగా సెలబ్రిటీలు బాగా సంపాదించినా తర్వాత తమకి ఇష్టమైనవి కొనుక్కుంటూ ఉంటారు. కొంతమందికి కార్లు, బైక్స్ మీద కూడా పిచ్చి ఉంటుంది. అలాగే కమెడియన్ వైవా హర్షకు కూడా బైక్స్ అంటే చాలా పిచ్చి. వైవా అనే షార్ట్ ఫిలింతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు హర్ష. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో ప్రస్తుతం కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు.

హర్షకు కాలేజీలో చదివేటప్పుడు నుంచే బైక్స్(Bikes) అంటే పిచ్చి. అప్పుడప్పుడు బైక్ రేసింగ్స్ లో కూడా పాల్గొన్నాడు. సక్సెస్ అయ్యాక, డబ్బులు సంపాదించుకున్నాక తనకి ఇష్టమైన బైక్స్ అన్ని కొనుక్కుంటున్నాడు. దసరా(Dasara) రోజు అందరం మన వెహికల్స్ కి పూజ చేస్తామని తెలిసిందే. వైవా హర్ష కూడా అతని బైక్స్, కార్లు అన్ని బయట పెట్టి, అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసి, పూజలు చేసి, బొట్లు పెట్టి, దండలు వేసి, హారతి ఇచ్చి పండగ చేసుకున్నాడు.

Also Read : ఈవారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? హౌస్ లో గ్రూపు రాజకీయాలు..

తన బైక్స్ కి పూజ చేసే వీడియోలు, తన బైక్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. హర్షకు సుమారు 7 డిఫరెంట్ కంపెనీల బైక్స్, స్కూటీ, రెండు కార్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బైక్స్ అన్ని కూడా ఖరీదైన మోడల్స్ అనే తెలుస్తుంది. ధోనికి కూడా బైక్స్ అంటే ఇష్టమని తెలిసిందే. ధోని దగ్గర అయితే ఏకంగా ఒక గ్యారేజీ నిండా బైక్స్ ఉంటాయి. దీంతో వైవా హర్ష పోస్ట్ కి అందరూ కామెంట్స్ లో చిన్న సైజు ధోని గ్యారేజ్ లా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో హర్ష కూడా ధోనిలా గ్యారేజ్ నిండా ఉండేలా బైక్స్ కొనుక్కుంటాడేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Harsha (@harshachemudu)