Bigg Boss 7 Day 51 : ఈవారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? హౌస్ లో గ్రూపు రాజకీయాలు..

 సోమవారం ఎపిసోడ్ లో సగం నామినేషన్స్ అయ్యాయి. నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తయ్యాయి.

Bigg Boss 7 Day 51 : ఈవారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? హౌస్ లో గ్రూపు రాజకీయాలు..

Bigg Boss 7 Day 51 Highlights Nominations for this Week

Updated On : October 25, 2023 / 6:30 AM IST

Bigg Boss 7 Day 51 : సోమవారం ఎపిసోడ్ లో సగం నామినేషన్స్ అయ్యాయి. నామినేషన్స్ లో శివాజీ.. శోభాశెట్టి, ప్రియాంకలను, అశ్విని.. శోభాశెట్టి, ప్రియాంకలను, గౌతమ్.. ప్రశాంత్, భోలేలను, ప్రియాంక.. భోలే, అశ్వినిలను, సందీప్.. అశ్విని, భోలేలను, శోభాశెట్టి.. శివాజీ, యావర్ లను, భోలే.. శోభాశెట్టి, గౌతమ్ లను నామినేట్ చేశాడు. ఈ ఎపిసోడ్ లో శోభాశెట్టి – శివాజీ, భోలే మధ్యలోనే గొడవ అంతా సాగింది.

ఇక నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తయ్యాయి. అమర్ దీప్.. శివాజీ, భోలేని నామినేట్ చేశాడు. యావర్.. శోభాశెట్టి, సందీప్ లను నామినేట్ చేశాడు. తేజ.. అశ్విని, సందీప్ లను నామినేట్ చేశాడు. ప్రశాంత్.. గౌతమ్, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. రతిక.. శోభాశెట్టి, అమర్ దీప్ లను నామినేట్ చేసింది. అర్జున్.. తేజ, భోలేలను నామినేట్ చేశాడు.

అయితే ఈ నామినేషన్స్ లో ప్రశాంత్ గౌతమ్ ని సరైన కారణం లేకుండా నామినేట్ చేయడంతో గౌతమ్ ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు. ప్రశాంత్ ని ఇమిటేట్ చేస్తూ గౌతమ్ రెచ్చిపోయాడు. ప్రశాంత్ ఏమి చేయలేక సైలెంట్ గా ఉండిపోయాడు. అలాగే ప్రశాంత్ అమర్ దీప్ ని కూడా నామినేట్ చేసి మా గ్రూప్ భోలే గురించి మాట్లాడటం నచ్చలేదని చెప్పడంతో గ్రూపు రాజకీయాలు బయట పడ్డాయని అమర్ ఫైర్ అయ్యాడు. దీంతో మళ్ళీ ప్రశాంత్ దగ్గర మాట్లాడటానికి ఏం లేకుండా పోయింది.

Also Read : Jailer Actor arrest : జైలర్ మూవీ విలన్ వినాయకన్ అరెస్ట్…ఎందుకంటే…

మొత్తంగా ఈవారం నామినేషన్స్ శోభాశెట్టి, భోలే శివాలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్, సందీప్, గౌతమ్ లు ఉన్నారు. మరి వచ్చేవారం వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.