Jailer Actor arrest : జైలర్ మూవీ విలన్ వినాయకన్ అరెస్ట్…ఎందుకంటే…

జైలర్ సినిమా విలన్ వినాయకన్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. జైలర్ చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు వినాయకన్ బహిరంగ ప్రదేశంలో అదుపుతప్పి ప్రవర్తించాడనే ఆరోపణలపై కేరళలో అరెస్టు చేశారు.....

Jailer Actor arrest : జైలర్ మూవీ విలన్ వినాయకన్ అరెస్ట్…ఎందుకంటే…

Actor Vinayakan

Updated On : October 25, 2023 / 2:27 PM IST

Jailer Actor arrest : జైలర్ సినిమా విలన్ వినాయకన్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. జైలర్ చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు వినాయకన్ బహిరంగ ప్రదేశంలో అదుపుతప్పి ప్రవర్తించాడనే ఆరోపణలపై కేరళలో అరెస్టు చేశారు. నటుడు వినాయకన్‌ ఎర్నాకుళం నార్త్ పోలీసు స్టేషన్‌లో హంగామా సృష్టించారు. అతడిని ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Also Read : Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన కారు…ఆరుగురి ఆదికైలాష్ యాత్రికుల మృతి

మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో అదుపు లేకుండా ప్రవర్తించడం,పోలీస్ స్టేషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై నటుడిని అరెస్టు చేశారు. అతను నివసించే అపార్ట్‌మెంట్ వద్ద గొడవ సృష్టించాడని ఫిర్యాదులు అందడంతో అతన్ని విచారణ కోసం స్టేషన్‌కు పిలిచారు.

Also Read : World Cup-2023 : ఐసీసీ వరల్డ్ కప్.. బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

పీకల దాకా మద్యం తాగిన వినాయకన్ అపార్టుమెంటులో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు చెప్పారు. వినాయకన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు.