Unstoppable : అన్‌స్టాపబుల్ షో కోసం హైదరాబాద్ చేరుకున్న రణబీర్ కపూర్..

అన్‌స్టాపబుల్ షో షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న రణబీర్ కపూర్. వైరల్ అవుతున్న వీడియో.

Ranbir Kapoor landed in hyderabad for Balakrishna Unstoppable talk show

Unstoppable : తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా స్ట్రీమ్ అవుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK. ఇప్పటికే ఈ టాక్ షో నుంచి రెండు సీజన్లు ఆడియన్స్ ముందుకు రాగా.. ఒకదాన్ని మించి మరో సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ షో మూడో సీజన్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూడో సీజన్ ఒక స్పెషల్ ఎపిసోడ్ తో ఈ దసరాకి మొదలైపోయింది. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి టీంతో ఆ స్పెషల్ ఎపిసోడ్ సాగింది.

కాగా మొదటి రెండు సీజన్స్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడా స్టార్స్ దాదాపు ఈ షోకి హాజరయ్యారు. మరి ఈ మూడో సీజన్ లో ఎలాంటి గెస్ట్ లు రాబోతున్నారంటూ ఆడియన్స్ అంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సీజన్ గెస్ట్ లు కోసం బాలయ్య తెలుగు రాష్ట్రాలని వదిలేసి నార్త్ వైపు వెళ్లారు. అక్కడి నుంచి స్టార్ హీరో రణబీర్ కపూర్ ని అన్‌స్టాపబుల్ షోకి తీసుకు వస్తున్నారు.

Also read : Bandla Ganesh : అయ్యప్ప మాలలో ఉండి ఆ పనిచేస్తావా? బండ్లన్నపై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

ఆల్రెడీ ఈ విషయాన్ని షో నిర్వాహుకులు ఆడియన్స్ కి తెలియజేశారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ షూటింగ్ కోసం రణబీర్ హైదరాబాద్ చేరుకున్నారు. రణబీర్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఆడియన్స్ ఈ ఎపిసోడ్ పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

కాగా రణబీర్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగాతో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే రణబీర్, రష్మిక, సందీప్ అన్‌స్టాపబుల్ షోకి రాబోతున్నారు. రష్మిక కూడా వస్తుండడంతో బాలయ్య విజయ్ దేవరకొండతో ప్రేమ రూమర్స్ గురించి ప్రశ్నించే అవకాశం ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ ని కూడా ఇలా అడిగి ఆ రూమర్స్ కి ఒక చెక్ పెట్టేశారు.