రాణీ ముఖర్జీ ‘మర్దానీ 2’ – ఫస్ట్ డే కలెక్షన్స్
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘మర్దానీ 2’ మొదటిరోజు కలెక్షన్ల వివరాలు..

రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘మర్దానీ 2’ మొదటిరోజు కలెక్షన్ల వివరాలు..
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా.. ‘మర్దానీ 2’.. 2014లో వచ్చిన ‘మర్దానీ’ చిత్రానికి ఇది సీక్వెల్.. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీ పుత్రన్ దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.
డిసెంబర్ 13న ‘మర్దానీ 2’ విడుదల అయింది. మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో ‘మర్దానీ’ రూపొందగా, కిడ్నాపింగ్, రేప్ వంటి ఘటనలతో ‘మర్దానీ 2’ తెరకెక్కింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే కాక చక్కటి వసూళ్లు కూడా దక్కాయి. తొలిరోజు సుమారు రూ. 5 నుంచి 6 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా.
అదేవిధంగా ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందన, విమర్శకుల సమీక్షలు పరిశీలిస్తే.. ఇక మీదట బాక్సాఫీసు వద్ద సందడి చేయనుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణి ముఖర్జీ నటించారు.