మర్థానీ-2 ఫస్ట్ లుక్
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న మర్థానీ-2 ఫస్ట్ లుక్ రిలీజ్..

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న మర్థానీ-2 ఫస్ట్ లుక్ రిలీజ్..
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ.. మర్థానీ-2. 2014లో వచ్చిన మర్థానీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీ పుత్రన్ డైరెక్టర్. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా మర్థానీ-2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఫస్ట్ పార్ట్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. రాణీ ముఖర్జీ నటనకు మంచి పేరు వచ్చింది. సెకండ్ పార్ట్ మరింత సీరియస్‌గా సాగుతుందట. రాణీ ముఖర్జీ శివానీ శివాజీ రాయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. రాజస్థాన్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ సింగ్ చౌహాన్, శృతి బప్నా, రాజేష్ శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే మర్థానీ-2 విడుదల కానుంది.