Bigg Boss 5 : బిగ్ బాస్ లో వీకెండ్ ఎంటర్టైన్మెంట్ అయిపోవడంతో మళ్లీ అసలు గేమ్ మొదలు పెట్టారు. ఇక ఎప్పటిలాగే వీకెండ్ తప్ప మిగిలిన అన్ని రోజులు గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు కంటెస్టెంట్స్. నిన్నటి ఎపిసోడ్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా అందరికి ఒకటి నుంచి ఆరు ర్యాంకులు ఇవ్వాలని చెప్పడంతో కంటెస్టెంట్స్ అందరికి వాళ్ళకి నచ్చిన ర్యాంకులు ఇచ్చారు. ఆ తర్వాత అందరూ ఇచ్చిన ర్యాంకులతో పాటు బిగ్ బాస్ కూడా ఫైనల్ ర్యాంక్స్ ఇచ్చాడు. హౌస్ లోని గ్రీనరీ ఏరియాలో ఒకటి నుంచి ఆరు వరకు బోర్డులు పెట్టి ఇచ్చిన ర్యాంకుల ప్రకారం అంతా అక్కడ నిల్చోమని చెప్పాడు బిగ్ బాస్.
Bigg Boss 5 : సన్నీ-సిరి మధ్య లవ్ ట్రాక్.. సీరియస్ అవుతున్న షణ్ను..
షణ్ను మొదటగా.. ఫస్ట్ ప్లేస్ షణ్నుకి ఇచ్చుకొని, సెకండ్ ప్లేస్లో శ్రీరామ్, మూడో ప్లేస్ లో సన్నీ, నాల్గో ప్లేస్ లో సిరి, ఐదో ప్లేస్ లో మానస్, ఆరో ప్లేస్ లో కాజల్ ఉంటారని చెప్పాడు.
తర్వాత కాజల్… ఫస్ట్ ప్లేస్ తనకే ఇచ్చుకొని, సెకండ్ ప్లేస్ సన్నీకి, మూడో ప్లేస్ లో మానస్, నాలుగో ప్లేస్ లో శ్రీరామచంద్ర, ఐదో ప్లేస్ లో సిరి, ఆరో ప్లేస్ షణ్ముఖ్ కి ఇచ్చింది.
తర్వాత మానస్.. ఫస్ట్ ప్లేస్ సన్నీకి ఇచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత కాజల్ కు రెండో స్థానం, షణ్ముఖ్ కు మూడో స్థానం, శ్రీరామచంద్రకు నాలుగో స్థానం, సిరికి ఐదో స్థానం ఇచ్చాడు. తనకు ఏ ర్యాంకు ఇచ్చుకోలేదు.
తర్వాత శ్రీరామచంద్ర.. షణ్ముఖ్, సిరి ఇద్దరికి రెండవ స్థానం ఇచ్చాడు. సన్నీకి మూడో స్థానం, కాజల్ కు నాలుగో స్థానం, మానస్ కు ఐదో స్థానం ఇచ్చి ఫస్ట్ ర్యాంక్ మాత్రం ఆ దేవుడే నిర్ణయిస్తాడు అని తనకి ఏ ర్యాంక్ ఇచ్చుకోలేదు.
తర్వాత సన్నీ.. కాజల్ కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి, మానస్ కు సెకండ్ ప్లేస్, సిరికి మూడో ప్లేస్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ లకు నాలుగో ప్లేస్ లు ఇచ్చి తాను అయిదవ స్థానం తీసుకుంటా అన్నాడు. ఇలా చెప్పి తనని తానూ తగ్గించుకోవడం కూడా ఒక గేమ్ స్ట్రాటజీ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
చివరగా సిరి.. బిగ్బాస్ హౌస్కు నేను అన్ఫిట్ అనుకున్నాను, కానీ ఆ అభిప్రాయాన్ని షణ్ను మార్చాడు కాబట్టి అతడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను అని చేపి షణ్నుకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. ఆ తర్వాత షణ్ను పక్కనే నేను ఉండాలి కాబట్టి రెండో ర్యాంక్ నాకు అని చెప్పింది. ఆ తర్వాత సన్నీకి మూడో ర్యాంక్, శ్రీరామచంద్ర కు నాలుగో ర్యాంక్, మానస్ కు ఐదో ర్యాంక్, కాజల్ కు ఆరో ర్యాంక్ ఇచ్చింది.
RRR Trailer: భీమ్-రామ్ వచ్చేస్తున్నారు.. ట్రైలర్ ముంగిట కళ్లుచెదిరే సర్ప్రైజ్లు!
ఇక వీళ్ళందరూ చెప్పడం పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ చివరగా కంటెస్టెంట్స్ కి తన ర్యాంకులు ఇచ్చాడు. బిగ్ బాస్ సన్నీకి ఫస్ట్ ప్లేస్, షణ్నుకు సెకండ్ ప్లేస్, కాజల్ కు థర్డ్ ప్లేస్, శ్రీరామ్ కు ఫోర్త్ ప్లేస్, మానస్ కు ఫిఫ్త్ ప్లేస్, సిరికి సిక్స్త్ ప్లేస్ ఇచ్చాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా గ్రీనరీలో ఉన్న బోర్డు వద్దకు వెళ్లి బిగ్ బాస్ ఇచ్చిన స్థానాల్లో నిలబడ్డారు.