Bigg Boss 5 : సన్నీ-సిరి మధ్య లవ్ ట్రాక్.. సీరియస్ అవుతున్న షణ్ను..

ఎప్పుడూ గొడవ పడి మళ్ళీ కలిసిపోయే షణ్ను సిరి మధ్య నిన్న కూడా మళ్ళీ దూరం పెరిగింది. కాజల్‌కు మరీ ఎక్కువ అటాచ్‌ అవద్దని సిరికి చెప్పాడు షణ్ను. అయినా షణ్ను చెప్పిన తర్వాత కూడా.....

Bigg Boss 5 : సన్నీ-సిరి మధ్య లవ్ ట్రాక్.. సీరియస్ అవుతున్న షణ్ను..

Sunny

Bigg Boss 5 :  వీకెండ్ ఎపిసోడ్ అయిపోవడంతో మళ్ళీ నిన్నటి నుంచి గొడవలు మొదలయ్యాయి బిగ్ బాస్ లో. ఎప్పుడూ గొడవ పడి మళ్ళీ కలిసిపోయే షణ్ను సిరి మధ్య నిన్న కూడా మళ్ళీ దూరం పెరిగింది. కాజల్‌కు మరీ ఎక్కువ అటాచ్‌ అవద్దని సిరికి చెప్పాడు షణ్ను. అయినా షణ్ను చెప్పిన తర్వాత కూడా వాళ్లిద్దరూ వెంటనే ఫ్రెండ్‌షిప్‌ హగ్‌ అంటూ ఒకరికొకరు హగ్ ఇచ్చుకున్నారు. దీంతో షణ్నుకి బాగా కాలింది.

Indian 2: త్రిష కాదు తమ్మూ.. హీరోయిన్ కోసం ఇండియన్ వేట!

ఆ తర్వాత మానస్‌, కాజల్‌… సన్నీ, సిరి ఇద్దరికీ లవ్ ట్రాక్ నడుస్తుందంటూ లింకు పెడుతూ సరదాగా అన్నారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్‌ వస్తుందంటూ సన్నీ వైపు చూసి కామెంట్లు చేశారు. వాళ్ళు సరదాగానే చేసినా దీన్ని షణ్ను సరదాగా తీసుకోలేకపోయాడు. దీంతో షణ్ను సిరిపై మరోసారి సీరియస్ అయ్యాడు. సిరి దగ్గరికి వచ్చి మీ ఇద్దరి మధ్య ట్రాక్‌ క్రియేట్‌ చేయాలని చూస్తున్నారని, నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్‌ బ్యాడ్‌ అవుతుందని చెప్పాడు షణ్ను. వాళ్లు సరదాగా అన్నార్లే అని చెప్పి సిరి లైట్‌ తీసుకోవడంతో షణ్ను మరింత సీరియస్ అయ్యాడు. అయినా ఇది నీకు చెప్పడం వల్ల నాకు ఏం ఒరుగుతుంది అంటూ కోపంగా లేచి వెళ్ళిపోయాడు.

Honor Killing : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. గర్భవతని కూడా చూడకుండా..

మళ్ళీ షణ్నునే సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం అవ్వాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారు అని చెప్పాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్‌ ఆలోచిస్తుంది. ఆమె నెక్స్ట్‌ నీ దగ్గరకే వస్తుంది. వాళ్లతో నువ్వు గొడవపడేలా చేసి నిన్ను కూడా పంపించే ప్లాన్ చేస్తారని చెప్పాడు. నిన్ను నా నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు అని మళ్ళీ బాధపడ్డాడు. అయినా సిరి వీటన్నిటిని లైట్ తీసుకోవడంతో షణ్ను మరింత రగిలిపోతున్నాడు.