Indian 2: త్రిష కాదు తమ్మూ.. హీరోయిన్ కోసం ఇండియన్ వేట!

విలక్షణ నటుడు కమల్ హాసన్ దక్షణాది లెజెడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా ఎంత విజయం సాధించిందో తెలిసిందే. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి..

Indian 2: త్రిష కాదు తమ్మూ.. హీరోయిన్ కోసం ఇండియన్ వేట!

Indian 2: విలక్షణ నటుడు కమల్ హాసన్ దక్షణాది లెజెడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా ఎంత విజయం సాధించిందో తెలిసిందే. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. అలాంటి సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో వాయిదా పడిన ఈ సినిమాకు ఆది నుండి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముందుగా కరోనా కష్టాలతో ఈ సినిమా వాయిదా పడింది.

RRR Trailer: భీమ్ వచ్చేస్తున్నాడు.. కౌంట్ డౌన్ స్టార్ట్!

ఆ తర్వాత షూటింగ్ మ్యాటర్ లో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్, దర్శకుడు శంకర్ మధ్య వివాదాలు తెలిసిందే. కోర్టుల వరకు వెళ్లిన ఈ వివాదం మొత్తానికి కొలిక్కి వచ్చి షూటింగ్ మొదలవుతుందనుకున్నారు. ఒకవైపు శంకర్ రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉండగానే.. హీరో కమల్ హాసన్ కు కరోనా రావడంతో మరో సమస్యగా మారింది. ఇప్పుడు కమల్ కరోనా నుండి కోలుకోవడంతో మేకర్స్ షూటింగ్ షురూ చేసేందుకు కసరత్తులు మొదలు పెట్టారు.

Salaar: క్రేజీ టాక్.. భారీ స్థాయిలో ఇంటర్వెల్ సీక్వెన్స్ రీషూట్?

అయితే ఇక్కడ మరో సమస్య ఉందట. గతంలో హీరోయిన్ కాజల్ ప్రస్తుతం గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. కాజల్ ఇదంతా ప్రచారం మాత్రమేనని వివరణ ఇచ్చినా పుకార్లు మాత్రం ఆగడం లేదు. అయితే.. వచ్చే ఏడాది సమ్మర్ లో మళ్ళీ మొదలు కానున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది చివరికి కానీ పూర్తికాదు. అంటే అప్పటి వరకు కాజల్ మాతృత్వానికి దూరంగా ఉండాలి. అందుకే, కాజల్ స్థానంలో త్రిషను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది.

Shraddha Das: శ్రద్ధా ఏందబ్బా ఇది.. మరీ ఇంతగా..

కానీ ఇప్పుడు త్రిష కాదు తమన్నా కాజల్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇండియన్ 2లో హీరోయిన్‌గానే కాకుండా వయసు మళ్లిన మరో పాత్రలో కూడా కనిపించాల్సి ఉంది. తమన్నా అయితే ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తుందని భావించిన మేకర్స్ తమ‍్ము బేబీని అప్రోచ్ అయ్యారట. పాత్ర కూడా నచ్చడంతో తమ్మూ కూడా వెంటనే ఒకే చేసిందని త‍్వరలో అధికారిక ప్రకటన వస్తుందని కోలీవుడ్‌ వార్గాలు భావిస్తున్నాయి.