Dhurandhar 2: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేక్షమైన ‘ధురంధర్ 2’.. 4 గంటల అన్‌కట్ వెర్షన్.. కానీ చిన్న ట్విస్ట్
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రణవీర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురందర్ 2(Dhurandhar 2).
- V Santhosh Kumar
- Published on- May 14, 2026 / 05:51 PM IST
ranveer singh dhurandhar 2 now streaming on Netflix
- ఓటీటీలోకి రణవీర్ సింగ్ ధురంధర్ 2
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ అన్‌కట్ వెర్షన్ విడుదల
- జియోహాట్‌స్టార్‌లో త్వరలో స్ట్రీమింగ్ ప్రారంభం
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ స్పై థ్రిల్లర్ మార్చి 19న థియేటర్లలో విడుదలై రికార్డు వసూళ్లను సాధించింది. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారి కోసం ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. అయితే, ప్రస్తుతం ఇది కేవలం యూఏఈ వంటి విదేశీ ప్రేక్షకులకే అందుబాటులో ఉండగా, భారతీయ ప్రేక్షకులు మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
ఈ చిత్ర ఓటీటీ వెర్షన్ ‘Raw & Undekha’ అనే ట్యాగ్‌లైన్‌తో దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో వస్తోంది. అంటే థియేటర్లలో కట్ చేసిన సీన్లతో కలిపి అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు. పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో హమ్జా అలీ మజారీగా రణవీర్ సింగ్ చేసే పోరాటం, అతడు టెర్రర్ నెట్‌వర్క్‌ను ఎలా కూల్చాడనేది ఈ సినిమాలో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ వంటి స్టార్ నటుల పెర్ఫార్మెన్స్ ఈ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇక ఇండియన్ ఆడియన్స్ కోసం ఈ సినిమా మే 14 తర్వాత జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. ఐబీ హెడ్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) ఒక డెత్ రో ఖైదీని అండర్ కవర్ ఏజెంట్‌గా ఎలా మార్చారు? కరాచీ మాఫియా సామ్రాజ్యంలో అతడి ప్రయాణం ఎలా సాగిందనేది ఈ సినిమాలో చూడవచ్చు. స్పై థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇదొక విజువల్ ఫీస్ట్ కానుంది.
