Dhurandhar 2 : రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. గూస్ బంప్స్ అంతే..
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ధురంధర్ 2 (Dhurandhar 2) చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : March 7, 2026 / 12:32 PM IST
Ranveer Singh Dhurandhar The Revenge Trailer Out now
- మార్చి 19న విడుదల కానున్న ధురంధర్ 2
- ప్రమోషనల్లో వేగం పెంచిన మూవీ యూనిట్
- తాజాగా ట్రైలర్ విడుదల
Dhurandhar 2 : సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ధురంధర్ 2. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించిన ధురంధర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లలో సంజయ్ దత్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తొలి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా రెండో భాగం (Dhurandhar 2) మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
