ISmart Shankar : కండలు పెంచుతున్న రామ్

  • Publish Date - March 14, 2019 / 04:57 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ‘రామ్’ డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు పొందిన ఈ నటుడు పూరి చేతిలో పడ్డాడు. ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. సినిమా పేరు ‘ఇస్మార్ట్ శంకర్’. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సినిమాకు సంబంధించిన విశేషాలను పూరి తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. రామ్ ఈ చిత్రంలో వెరైటీ స్టైల్‌లో కనిపించనున్నాడు. 

హీరోలను డిఫరెంట్ గా చూపించడంలో పూరి జగన్నాథ్ స్టైల్ చాలా డిఫరెంట్. టాలీవుడ్‌లో అందరి హీరోలను కవర్ చేసిన పూరి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈ దర్శకుడి పరిస్థితి కొంత బ్యాడ్‌గా ఉంది. సినిమాలు సక్సెస్ కావడం లేదు. దీనితో ఆయన తీస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’పై భారీ అంచనాలున్నాయి. సినిమా కోసం ‘రామ్’ భారీగా కండలు పెంచే పనిలో ఉన్నాడు. జిమ్‌లో ఎక్సర్ సైజు చేస్తున్న ఫోటోలని పూరి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రామ్‌ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.