×
Ad

Rasha Thadani : మహేష్ కొడుకు కోసం.. బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. బాబాయ్ కంటే ముందే బాలీవుడ్ కి జయకృష్ణ..

తాజాగా ఈ సినిమాలో జయకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు.(Rasha Thadani)

Rasha Thadani

Rasha Thadani : మహేష్ అన్న కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంగళవారం, RX100 సినిమాల డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా స్టార్ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో ఈ సినిమాని ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో జయకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు.(Rasha Thadani)

బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్, స్టార్ నిర్మాత అనిల్ తడానీ కూతురు రాషా తడానీ ని జయకృష్ణ సరసన హీరోయిన్ గా తీసుకున్నారు. రాషా తడానీ ఇటీవల ఆజాద్ అనే సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలో 19 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఉయ్ అమ్మా.. అనే ఐటెం సాంగ్ తో అదరగొట్టి ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకుంది.

Also Read : Varanasi Title Launch Event : మహేష్ – రాజమౌళి ‘వారణాసి’ టైటిల్ లాంచ్ గ్రాండ్ ఈవెంట్.. ఫోటోలు చూశారా?

రాషా తడానీ బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలబడుతుంది అని అంతా ఈ సినిమాతో ఊహించారు. బాలీవుడ్ లో నెక్స్ట్ సినిమా చేసే లోపే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అది కూడా మహేష్ అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేనితో. జయకృష్ణ మొదటి సినిమాకే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవడం గమనార్హం. రాషా తడానీ ఫ్యామిలీ బాలీవుడ్ లో మంచి పట్టు ఉంది కాబట్టి ఈ సినిమా అక్కడ కూడా రిలీజ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

దీంతో బాబాయ్ మహేష్ బాబు కంటే ముందే జయకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. మొత్తానికి రా & రస్టిక్ సినిమాలు తీసే అజయ్ భూపతి జయకృష్ణ – రాషా తడానీలను పెట్టి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.

Also Read : Chinnamasta Devi : రాజమౌళి ‘వారణాసి’ సినిమాలో ఛిన్నమస్తా దేవి రూపం.. ఇంతకీ ఆమె ఎవరు..? తల నరికేసుకొని రక్తధారలతో నగ్నంగా ఎందుకు ఉంటుంది..?

ఇక రాషా తడానీ తల్లి రవీనా టాండన్ బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది. తెలుగులో బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద.. సినిమాలో నటించింది.