×
Ad

Rashi Singh : ఇంటర్ లో ఏకంగా లెక్చరర్ తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్.. తన లవ్ స్టోరీ బయట పెట్టిన రాశీసింగ్..

ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ బయటపెట్టింది రాశీ సింగ్.(Rashi Singh)

Rashi Singh

Rashi Singh : హీరో హీరోయిన్స్ అప్పుడప్పుడు తమ ప్రేమ కథలను బయటపెడుతుంటారు. తాజాగా హీరోయిన్ రాశీసింగ్ తన లవ్ స్టోరీ బయటపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ రాశీ సింగ్ త్వరలో ఆహా ఓటీటీలో 3 రోజెస్ సిరీస్ సీజన్ 2 తో రాబోతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ బయటపెట్టింది రాశీ సింగ్.(Rashi Singh)

Also Read : Suresh Bobbili : ఆఫీస్ బాయ్ నుంచి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. రాజు వెడ్స్ రాంబాయి తో రీసెంట్ హిట్ కొట్టి..

రాశీ సింగ్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. నేను స్కూల్ అయ్యాక ఇంటర్‌లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్‌ను ప్రేమించాను. అతను నాకు బాయ్ ఫ్రెండ్. కాలేజీలో నాకు అతను ఫేవర్ గా ఉండేవాడు. ఆయన నాకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చేవాడు, వైవాలో ఏమి అడిగేవారు కాదు. వైవా జరిగినప్పుడు మేమిద్దరం సరదాగా కూర్చొని ఒక పది నిముషాలు టైమ్ పాస్ చేసుకునేవాళ్లం. అప్పుడు నా ఏజ్ 17. అప్పుడు అతనికి ఇంకా పెళ్లి అవ్వలేదు. ఇప్పుడు అతనికి పెళ్లి అయింది. అతను సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్నాడు. వాళ్ళ ఆవిడ కూడా ఫాలో అవుతుంది అనుకుంట. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని తెలిపింది.

 

Also See : Pawan Kalyan : మోకాళ్లపై కూర్చొని సన్మానం తీసుకున్న పవన్.. ఏకంగా ఆ బిరుదుతో సత్కారం.. కర్ణాటకలో పవన్ రేంజ్ ఇది..