×
Ad

Rashmika-Sreeleela: ఆ సినిమా చేయకపోవడమే బెటర్.. ఒకవేళ చేసినా.. శ్రీలీల కన్నా రష్మిక బెటర్..

సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. (Rashmika-Sreeleela)ఒక భాషలో హిట్ ఐన సినిమాను మరో భాషలో చేస్తూ ఉంటారు.

Rashmika is a better option than Srileela for the Bollywood remake of Arundhati

Rashmika-Sreeleela: సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఒక భాషలో హిట్ ఐన సినిమాను మరో భాషలో చేస్తూ ఉంటారు. కానీ, ఈ మధ్య పాన్ ఇండియా లెవల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి కాబట్టి, రీమేక్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ (Rashmika-Sreeleela)చూపించడం లేదు. అలాగే, కొన్ని క్లాసికల్ హిట్స్ ఉంటాయి. అలాంటి వాటిని రీమేక్ చేయకపోవడమే బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే, ఆ సినిమాలో మ్యాజిక్ రిపీట్ కాకపోతే హిట్ అవడం పక్కన పడితే దారుణమైన ట్రోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు, ఇప్పుడు అలాంటి క్లాసికల్ హిట్ నే రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆ రీమేక్ మరేదో కాదు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన “అరుంధతి”.

Chikiri-Kissik: పెద్ది దెబ్బకు పుష్ప 2 అవుట్.. ‘చికిరి’ సాంగ్ సరికొత్త రికార్డ్స్.. వేట మొదలు..

లేడీ సూపర్ స్టార్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. అరుంధతి, జేజమ్మగా అనుష్క రాజసం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. అలాంటి సినిమాను ఇంతకాలానికి బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీలతో. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అరుంధతి లాంటి సినిమాకి అనుష్కలా హైట్, పర్సనాలిటీ ఉన్నా స్టార్ అయితేనే ఆ రాజసం ఉట్టిపడుతుంది. కానీ, శశ్రీలీల అనుష్కలో సగం కూడా ఉండదు.

కాబట్టి, శ్రీలీల ఆ సినిమా చేస్తే వేస్ట్ ఆఫ్ టైం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ చేసిన కూడా రష్మిక మందన్నా బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. ఎందుకంటే, ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో రష్మిక మందన్నా క్రేజ్ బాగా పెరిగింది. ఆమె నటించిన సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి. యానిమల్ సినిమా ఏకంగా రూ.910 కోట్లు కలెక్ట్ చేయగా.. ఇటీవల విడుదలైన థామా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో, ఆమెకు మంచి మార్కెట్ ఏర్పడింది. కాబట్టి, అలాంటి సినిమాను శ్రీలీల కంటే రష్మికతో చేస్తే బాగుంటుందని బాలీవుడ్ మీడియా కామెంట్స్ చేస్తుంది. మరి ఈ కామెంట్స్ ను అరుంధతి రీమేక్ మేకర్స్ ఫాలో అవుతారా.. లేదా అనేది చూడాలి.