Forbes: సోషల్ మీడియా క్వీన్ రష్మిక.. రౌడీ హీరోను దాటేసింది!

క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటింగ్ హీరోయిన్. ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా వ‌రుస సినిమాలు చేస్తున్న రష్మిక సోష‌ల్ మీడియాలో కూడా చాలా..

Forbes: క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటింగ్ హీరోయిన్. ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా వ‌రుస సినిమాలు చేస్తున్న రష్మిక సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక ఇన్‌స్టాగ్రాములో 20 మిలియ‌న్స్‌కి పైగా ఫాలోవ‌ర్స్ సాధించిన సౌత్ సెల‌బ్రిటీగా టాప్ పొజీష‌న్ ద‌క్కించుకుంది. రష్మిక టాప్ పొజీష‌న్‌లో నిల‌వ‌డం విశేషం కాగా ఆ త‌ర్వాతి స్థానం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ద‌క్కింది.

Rashmika Mandanna: వరసపెట్టి ఆస్తులు కొనేస్తున్న భామ.. ఎక్కడో తెలుసా?

సౌత్ స్టార్స్ సోషల్ మీడియా పాపులారిటీ ఆధారంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితా రూపొందించగా.. ఇందులో రష్మిక 9.88 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, విజయ్ దేవరకొండ (9.67) రెండోస్థానంలో ఉన్నాడు. కన్నడ స్టార్ యశ్ (9.54) మూడో స్థానంలో, సమంత (9.49) నాలుగో స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ (9.46) కు ఐదో స్థానం, ప్రభాస్ (9.40) కు ఎనిమిదో స్థానం లభించాయి. ఆయా సినీ స్టార్లు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన గత 25 పోస్టులను ప్రాతిపదికగా తీసుకున్నారు.

Rashmika Mandanna : ఫస్ట్ లుక్ తో కుర్రాళ్ళ లుక్స్ ని తిప్పుకున్న నేషనల్ క్రష్..

ఫ్రొర్బ్స్ విడుదల చేసిన ఈ సౌత్ సోషల్ మీడియా జాబితాల రూపకల్పనలో ఫోర్బ్స్ ఇండియా (Forbes India), సోషల్ సమోసా (Social Media industry news and analysis portal), ఖోరజ్ (marketing technology company) పాలుపంచుకుని.. సెప్టెంబర్ 30 నాటికి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల‌ కార్యకలాపాలు పరిగణిస్తూ ఈ ర్యాంక్‌లు ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు