Rashmika Mandanna : విజయ్‌లో నాకు నచ్చేవి, నచ్చనవి అవే.. ఏంటి ఆ క్వాలిటీస్..!
విజయ్ దేవరకొండలో తనకి నచ్చే బెస్ట్ క్వాలిటీ, నచ్చని వరస్ట్ క్వాలిటీ అవే అంటున్న రష్మిక మందన్న. ఏంటి ఆ క్వాలిటీస్..!
- gum 95921
- Published On : April 4, 2024 / 08:05 PM IST
Rashmika Mandanna about Vijay Deverakonda best and worst quality
Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ లవ్ రూమర్స్ తో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటారు. వారిద్దరి మధ్య ఉన్నది ఏంటో తెలియదు గాని, వారి కామెంట్స్ మాత్రం ప్రేమ వార్తలకు దారి తీస్తుంటాయి. రీసెంట్ గా రష్మిక బాలీవుడ్ లోని నేహా ధుపియా పోడ్‌కాస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఆసక్తికర కామెంట్సి చేసారు.
విజయ్ దేవరకొండలో నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి..? నచ్చని వరస్ట్ క్వాలిటీ ఏంటి..? అని ప్రశ్నించారు. ఇక దీనికి రష్మిక బదులిస్తూ.. “విజయ్ కూడా నాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. దీంతో మా ఇద్దరి ఆలోచనలు, చేసే పనులు ఒకేలా ఉంటాయి. ఈ విషయం విజయ్ లో నా బాగా ఇష్టం. ఇక నచ్చని విషయం అంటే.. వర్క్ విషయంలో విజయ్ చాలా సీరియస్ గా ఉంటాడు. ఎప్పుడు ఏదొక వర్క్ చేస్తూనే ఉంటాడు. అది నాకు నచ్చదు” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Vijay Deverakonda : నా లవ్ స్టోరీ కంటే.. సుధీర్ రష్మీల లవ్ స్టోరీ ఫేమస్..
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూలోనే తాను విజయ్ ని ‘విజ్జు’ అని ముద్దుగా పిలుస్తానని కూడా రష్మిక చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ అన్ని విన్న నెటిజెన్స్.. వీరిద్దరి ప్రేమకి ఇది కూడా సాక్ష్యంగా చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు అందరూ అనుకుంటున్నట్లు ప్రేమించుకుంటున్నారా లేదా అనేది తెలియాలంటే.. కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.
కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నారు. ఇద్దరు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి ఓకే చెబుతూ తమ స్టార్‌డమ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. రష్మిక టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే.. లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తూ వస్తున్నారు.
