Rashmika Mandanna : అనిరుద్‌తో కలిసి రష్మిక కొత్త యాడ్ చూశారా..!
తమిళ రాక్ స్టార్ అనిరుద్‌తో కలిసి రష్మిక చేసిన కొత్త యాడ్ చూశారా..?
- gum 95921
- Published On : February 18, 2024 / 10:16 AM IST
Rashmika Mandanna ad with music director Anirudh Ravichander
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయ్యిపోయారు. స్టార్ హీరోల సినిమాల నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ వరకు రష్మిక కాల్ షీట్స్ కోసమే ఎదురు చూస్తున్నాయి. ఇక సినిమాల్లో రష్మిక క్రేజ్ చూసిన పలు బిజినెస్ బ్రాండ్స్.. తమ ప్రమోషన్స్ కోసం రష్మిక ఇమేజ్ ని ఉపయోగించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఈక్రమంలోనే పలు ప్రోడక్ట్స్ కి రష్మిక బ్రాండ్ అంబాసడర్ గా సైన్ చేసేస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కూల్ డ్రింక్ ప్రోడక్ట్ ‘7up’కి కూడా సైన్ చేశారు. దీంతో ఈ బ్రాండ్ కోసం ఒక కొత్త యాడ్ ని కూడా చేశారు. ఈ యాడ్ లో రష్మికతో పాటు తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ కూడా కనిపించారు. యాడ్ చూడడానికి సినిమాటిక్ గా చాలా బాగుంది. ఈ యాడ్ ని రష్మిక తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ కొత్త యాడ్ వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
Also read :Rashmika Mandanna : చావు నుంచి తప్పించుకున్నామంటూ.. రష్మిక పోస్టు..
ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా రష్మిక ఓ ప్రమాదం నుంచి బయట పడినట్లు తెలియజేసారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రష్మిక ఇలా రాసుకొచ్చారు. “మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము. ఈరోజు మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నాము” అంటూ హీరోయిన్ శ్రద్దా దాస్ తో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ పోస్టు చూసిన ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోతున్నారు. అసలు ఏం జరిగిందని టెన్షన్ పడుతున్నారు.
అసలు విషయం ఏంటంటే.. రష్మిక అండ్ శ్రద్దా కలిసి ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో బయలుదేరారు. అయితే విమానం టేక్ ఆఫ్ అయిన అరగంటకే ఏదో సమస్య వల్ల మళ్ళీ ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యిందట. ఈ విషయం గురించి తెలియజేస్తూనే.. రష్మిక ఆ పోస్టు వేసినట్లు ప్రముఖ నేషనల్ మీడియా రాసుకొచ్చింది.
