Hebah Patel: పది రోజుల్లోనే ఓటీటీలోకి.. హెబ్బా పటేల్ సూపర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
పది రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన హెబ్బా పటేల్(Hebah Patel) కొత్త సినిమా.
Hebah patel Repu udayam 10 gantalaku movie ott streaming update
- ఓటీటీలో హెబ్బా పటేల్ కొత్త సినిమా
- కేవలం పది రోజుల్లోనే స్ట్రీమింగ్ వచ్చేసిన థ్రిల్లర్ మూవీ
- అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి మరి
Hebah Patel; హాట్ బ్యూటీ హెబ్బా పటేల్, చైతన్య రావు జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రేపు ఉదయం 10 గంటలకు’. ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో, కేవలం పది రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Pawan- Charan: రామ్ చరణ్‌కు అదే శ్రీరామరక్ష.. పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెష్
గతంలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో అలరించిన హెబ్బా(Hebah Patel)- చైతన్య జోడీ, ఈసారి థ్రిల్లర్ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మించిన ఈ సినిమాలో అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. కథపరంగా ఆసక్తిని కలిగించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ వాచ్‌గా ఇది నిలుస్తుంది. మరి థియేటర్స్ లో ప్లాప్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
