Rashmika Mandanna : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉందని, వాళ్ళు డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను రష్మిక, విజయ్ గతంలో కొట్టిపారేశారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి తిరగడం, విజయ్ ఇంట్లోనే పలు పండగలు రష్మిక సెలబ్రేట్ చేసుకోవడం, ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్లడం జరుగుతూనే ఉంది. వీటి గురించి అడిగితే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు.
Also See : Vishwak Sen : ఫ్యామిలీతో విశ్వక్ సేన్ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
ఇప్పటికే పలు పండగలకు రష్మిక ఫొటోలు షేర్ చేయగా అవి విజయ్ దేవరకొండ ఇంట్లో దిగినవి కావడంతో విజయ్ ఇంట్లోనే రష్మిక పండగలు సెలబ్రేట్ చేసుకుంటుందని అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు దీపావళి కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది.
తాజాగా రష్మిక మందన్న దీపావళి సందర్భంగా పలు ఫొటోలు షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల కింద తనే ఫోటో క్రెడిట్స్ అంటూ ఆనంద్ దేవరకొండ పేరుని ట్యాగ్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఆనంద్ దేవరకొండనే తీసాడని తెలుస్తుంది. దీంతో మరోసారి రష్మిక ఎప్పట్లాగే విజయ్ ఇంట్లోనే పండగ సెలబ్రేట్ చేసుకుంది అని అర్ధమవుతుంది. విజయ్, ఆనంద్ కూడా అనిన్న పలు దీపావళి స్పెషల్ ఫొటోలు షేర్ చేసారు. ఆ ఫొటోలు రష్మిక తీసిందని భావిస్తున్నారు. ఇలా రెగ్యులర్ గా పండగలు విజయ్ ఇంట్లో చేసుకుంటూ, విజయ్ తో ట్రిప్స్ వేస్తూ వీటి గురించి ఏం అడిగినా మా ఇద్దరి మధ్య ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నా వీళ్ళ గురించి అనుకునేవాళ్లు అనుకుంటూనే ఉన్నారు.