Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా.. గ్రాండ్ లాంచ్..

తాజాగా రష్మిక కొత్త సినిమా ప్రారంభమైంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్‌బో అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Rashmika Mandanna first lady oriented movie launched in Annapurna Studios

Rashmika Mandanna : స్టార్ హీరోయిన్స్(Heroins) గా సక్సెస్ అయిన వాళ్లంతా ఏదో ఒక సమయంలో లేడీ ఓరియెంటెడ్(Lady Oriented) సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తారు. చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు. ఒకప్పటి హీరోయిన్స్ మాత్రమే కాదు కొంతకాలం కింద వచ్చిన హీరోయిన్స్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు.

ఇప్పటికే అనుష్క, నయనతార, త్రిష, కాజల్, సమంత, తాప్సి.. ఇలా చాలా మంది హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయగా ఇప్పుడు నేషనల్ క్రష్(National Crush) రష్మిక(Rashmika) కూడా ఈ లిస్ట్ లో చేరింది. ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా రష్మిక కొత్త సినిమా ప్రారంభమైంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్‌బో అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Balagam : మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న బలగం.. ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం.. ప్రియదర్శి స్పెషల్ పోస్ట్..

తాజాగా రష్మిక మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న రెయిన్‌బో సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి సురేష్ బాబు, అల్లు అరవింద్, అమల ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి. అయితే ఈ సినిమా ఏ జోనర్ లో వస్తుంది అనేది ఇంకా తెలీదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు సమాచారం.