Rashmika Mandanna : రష్మిక డీప్ ఫేక్ నిందితుడి అరెస్ట్ పై రష్మిక రియాక్షన్.. ఏమందంటే..?

నిన్న రష్మిక డీప్ ఫేక్ వీడియోని తయారుచేసిన నిందిస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డీప్ ఫేక్ కేసులో నిందితుడి అరెస్ట్ పై రష్మిక స్పందించింది.

Rashmika Mandanna first Reaction on her Deep fake Video Accused Arrest

Rashmika Mandanna : ఇటీవల కొన్ని నెలల క్రితం హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇది చర్చగా మారింది. రష్మిక కూడా దానిపై స్పందించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు దీనిపై స్పందించి ఇలాంటి చర్యలని ఖండించారు. ఢిల్లీ పోలీస్ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ మొదలుపెట్టారు.

మొదట ఈ వీడియోని సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేసిన కొంతమందిని అరెస్ట్ చేశారు. అనంతరం నిన్న రష్మిక డీప్ ఫేక్ వీడియోని తయారుచేసిన నిందిస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈమని నవీన్ ని ఈ కేసులో నిందితుడిగా గుర్తించి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. దీంతో పలువురు పోలీసులని అభినందించారు.

Also Read : Hanuman : ప్రభాస్, మహేష్, చరణ్, బన్నీ.. అందరి రికార్డులు బద్దలుకొట్టేసిన ‘హనుమాన్’.. వారెవ్వా.. కలెక్షన్స్‌లో హవా..

ఈ డీప్ ఫేక్ కేసులో నిందితుడి అరెస్ట్ పై రష్మిక స్పందించింది. దీనికి బాధ్యులైన వారిని పట్టుకున్నందుకు ఢిల్లీ పోలీస్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విషయంలో నాకు సపోర్ట్ గా నిలిచిన వారికి, నాపై ప్రేమ చూపించిన వారికి కృతజ్ఞతలు. అబ్బాయిలు, అమ్మాయిలు.. మీకు తెలియకుండా మీ ఫోటోని మార్ఫింగ్ చేస్తే అది కచ్చితంగా తప్పు. దీన్ని గుర్తుంచుకోండి అని పోస్ట్ చేసింది.