Hanuman : ప్రభాస్, మహేష్, చరణ్, బన్నీ.. అందరి రికార్డులు బద్దలుకొట్టేసిన ‘హనుమాన్’.. వారెవ్వా.. కలెక్షన్స్‌లో హవా..
హనుమాన్ సినిమా నార్త్ ఇండియా, అమెరికాలో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో అయితే హనుమాన్ సినిమా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

Teja Sajja Hanuman Movie Creates New Record in America with Collections
Hanuman : ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ రోజు ముందు ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకొని పాన్ ఇండియా వైడ్ దూసుకుపోయింది. మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా మొదట్నుంచి రిలీజ్ ముందు వరకు కూడా ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని రిలీజ్ అయి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
హనుమాన్ సినిమా రిలీజ్ అయి తొమ్మిది రోజులు అవుతున్నా, సంక్రాంతి హాలిడేస్ అయిపోయినా ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి, కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లో దూసుకుపోతుంది. అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయిపోయి సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది.
ఇక హనుమాన్ సినిమా నార్త్ ఇండియా, అమెరికాలో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో ఇప్పటికే 25 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక అమెరికాలో అయితే హనుమాన్ సినిమా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ అమెరికాలో 4 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అది కూడా 9 రోజుల్లో. చాలా మంది స్టార్ హీరోల సినిమాలు అమెరికాలో లైఫ్ టైం వసూళ్లు కూడా ఇంత లేవు.
Also Read : Devara : ఎన్టీఆర్ ‘దేవర’కు పోటీగా స్టార్ హీరోల సినిమాలు.. దేవర పాన్ ఇండియా వర్కౌట్ అవుతుందా?
అమెరికాలో టాప్ 10 కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో 20 మిలియన డాలర్స్ తో బాహుబలి 2 మొదటి ప్లేస్ లో ఉంది. RRR సినిమా 14.3 మిలియన డాలర్స్ తో రెండో ప్లేస్ లో ఉంది. సలార్ 8.9 మిలియన డాలర్స్ తో మూడో ప్లేస్ లో, బాహుబలి 1 నాలుగో స్థానంలో 8 మిలియన డాలర్స్ తో ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఐదో స్థానంలో 4 మిలియన డాలర్స్ తో హనుమాన్ సినిమా చేరింది. ఇప్పటివరకు 3 మిలియన డాలర్స్ పైన అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో, రామ్ చరణ్ రంగస్థలం, మహేష్ బాబు భరత్ అనే నేను, ప్రభాస్ సాహో, ఆదిపురుష్ సినిమాలు ఉండగా వీటన్నిటిని దాటి హనుమాన్ సినిమా 4 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ఇంకా పెరగనున్నాయి. దీంతో తేజసజ్జ హనుమాన్ సినిమాతో ప్రభాస్, మహేష్, చరణ్, బన్నీ తమ సినిమాలతో అమెరికాలో సెట్ చేసిన రికార్డులని బద్దలు కొట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో అయిదో సినిమాగా నిలిపాడు. మరోసారి కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా భారీ విజయం సాధిస్తుందని హనుమాన్ ప్రూవ్ చేసింది.
#HANUMAN peaking record heights in Overseas with ease ❤️?
$4 MILLION+ minted by #HanuManRAMpage in USA propelling the superhero flick into TOP 5 All-Time Highest Telugu Grossers List ??
A @PrasanthVarma film
?ing @tejasajja123Overseas Release by @Primeshowtweets &… pic.twitter.com/NWhXvXlgE4
— Nirvana Cinemas (@NirvanaCinemas) January 20, 2024