Rashmika Mandanna : నా స్వయంవరంలో ఆ ముగ్గురూ ఉండాలి.. విజయ్ దేవరకొండని పక్కనపెట్టేసిందేంటి??

త్వరలో అమితాబ్ తో కలిసి నటించిన గుడ్ బై సినిమా రిలీజ్ కానుంది. దీంతో రష్మిక బాలీవుడ్ లో గుడ్ బై సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా...............

Rashmika Mandanna interesting comments about her swayamvaram

Rashmika Mandanna :  పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. త్వరలో అమితాబ్ తో కలిసి నటించిన గుడ్ బై సినిమా రిలీజ్ కానుంది. దీంతో రష్మిక బాలీవుడ్ లో గుడ్ బై సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన స్వయంవరం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

ఇంటర్వ్యూలో మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు అని రష్మికని అడగగా రష్మిక.. తన స్వయంవరంలో తన ఫేవరేట్ హీరో, తమిళ్ స్టార్ హీరో విజయ్, అలాగే అల్లు అర్జున్, రణబీర్ కపూర్ ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Song from Dasara : ధూమ్ ధామ్ దోస్తాన్.. పక్కా తెలంగాణ మాస్ సాంగ్ తో అదరగొట్టేసిన నాని..

అయితే ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ పేరు చెప్పకపోవడంతో రష్మిక అభిమానులతో పాటు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అంటారు. వీళ్ళు కూడా అంతే క్లోజ్ గా ఉంటారు. మరి రష్మిక తన స్వయంవరంలో విజయ్ దేవరకొండ ఉండాలని చెప్పకపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.