Rashmika mandanna interesting comments about sikandar movie flop
Rashmika Mandanna: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశకు దక్కించుకుంటున్న స్టార్ బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది రష్మిక మందన్న అనే చెప్పాలి. వరుసగా క్రేజ్ సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. పుష్ప 2, యానిమల్ సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక గత ఏడాది కుబేర, ధమ్మా, సికందర్, చావా, ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు చేసింది.
అయితే, బాలీవుడ్ లో ఆమె చేసిన సికందర్ మాత్రం డిజాస్టర్ అయ్యింది. సల్మాన్ ఖాన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. కనీసం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు. అయితే, ఈ సినిమా విషయంలో తాను చాలా డిజప్పాయింట్ అయినట్టుగా చెప్పింది రష్మిక.
Pooja Hegde: ఆ హీరో చెంప చెల్లుమనిపించాను.. క్యారవాన్ లో అసభ్యంగా.. అనుమతిలేకుండా!
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక(Rashmika Mandanna) సికందర్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను చాలా నమ్మకంగా చేసిన సినిమా సికందర్. సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. కానీ, సికందర్ విషయంలో నాకు ముందు చెప్పిన కథ వేరు, తరువాత చాలా మార్పులు చేశారు. ఇలా జరగడం సినిమాల విషయంలో మాములే. సికందర్ విషయంలో కూడా అదే జరిగింది అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె మైసా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.