Rashmika Mandanna
Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కమర్షియల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతుంది. ఇలాంటి సమయంలో ఒక కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రష్మిక మెయిన్ లీడ్ లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కానుంది.(Rashmika Mandanna)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించి వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ మహేష్ బాబు లో మీకు నచ్చేది ఏంటి అని అడిగారు.
Also Read : Ram Gopal Varma : మోహన్ బాబునే రిజెక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. చెప్పినా వినలేదు..
దీనికి రష్మిక సమాధానమిస్తూ.. మహేష్ సర్ కి ఏజ్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. ఆయన ఏజ్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. నాకు అది నచ్చుతుంది. అసలు అది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని రిప్లై ఇచ్చింది.
దీంతో రష్మిక ట్వీట్ ని మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబు – రష్మిక కలిసి గతంలో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. మహేష్ అందం గురించి, మహేష్ ఎంత ఏజ్ పెరిగినా అలా ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అని అందరికి సందేహమే.
Somehow I think sir will just never age.. if at all.. he’s aging backwards.. I love it! I love that.. I want to know how that’s even possible!😄🩷
— Rashmika Mandanna (@iamRashmika) November 3, 2025